Footer Bottom Menu

ఇకపై బఫరింగ్ ఉండదు_బఫరింగ్ సమస్యలను ఎలా పరిష్కరించాలి మరియు అల్టిమేట్ హై-స్పీడ్ ఇంటర్నెట్ ఎక్స్ పీరియన్స్ ని పొందాలి.

  • 0

  • 4 minutes

ఇది ఊహించండి — మీకు ఇష్టమైన టీవీ షో సీజన్ మీ OTT ప్లాట్ఫామ్లో ఇప్పుడే ప్రారంభమైంది. మీరు మీ స్మార్ట్ టీవీని ఆన్ చేసి, చూడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఐదు నిమిషాల తర్వాత మీ వీడియో నిలిచిపోయి ఒక స్పిన్నింగ్ సర్కిల్ మీ స్క్రీన్ మధ్యలో కనిపిస్తుంది. అది నెమ్మదిగా తిరుగుతుంటుంది. బహుశా మీరు వరల్డ్ ఆఫ్ వార్షిప్ల యొక్క సరికొత్త వెర్షన్ మీకు ఇష్టమైన గేమ్ను ఆడుతూ ఉండవచ్చు. దీంతో మరోసారి తెల్లటి వృత్తం కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని నిస్సహాయతకు, నిరాశకు గురిచేస్తుంది.

మనం హై-స్పీడ్ ఇంటర్నెట్ పరంగా చాలా ముందుకు వచ్చినప్పటికీ, బఫరింగ్ అనేది ఇప్పటికీ మనలో చాలా మంది తమ దైనందిన జీవితంలో కొంత వరకు ఎదుర్కొనే సమస్య. ఈ ఆర్టికల్లో, ఈ నిరంతర సమస్యను పరిష్కరించడంలో మేము మీకు సహాయం చేస్తాము - బఫరింగ్ అంటే ఏమిటి, అది ఎందుకు జరుగుతుంది, దాన్ని పరిష్కరించడానికి మీరు ఏం చేయవచ్చు అనే వాటి గురించి మాట్లాడుదాం.

బఫరింగ్ ఎందుకు అవుతుంది

బఫరింగ్ను అర్థం చేసుకోవడానికి, మనం ముందుగా వీడియో స్ట్రీమింగ్ భావనను అర్థం చేసుకోవాలి. సాధరణంగా స్ట్రీమింగ్ పరికరాలు ఇంటర్నెట్ నుంచి ప్లే అయ్యే వీడియోలను బఫర్ చేస్తాయి. దీని అర్థం వారు వీడియోను మీరు చూస్తున్న దానికంటే ముందుగా ప్రసారం చేస్తారు. తద్వారా మీరు చూస్తున్నప్పుడు అది నిరంతరం ప్లే అవుతుందని అర్థం.

కొన్ని కారణాల వల్ల, ఫైల్ స్ట్రీమింగ్ అయ్యే పాయింట్ వరకు వీడియో క్యాచ్ అయితే, మీరు ఇకపై సాఫీగా ఆగకుండా వీడియోను చూడలేరు. బఫరింగ్ ప్రారంభమవుతుంది, మీరు మీ స్క్రీన్పై భయంకరమైన తెల్లటి వృత్తాలు, తిరిగే బాణాలు లేదా లోడ్ అవుతున్న సందేశాలు చూస్తారు. వీడియో స్ట్రీమ్ క్యాచ్--అప్ అయినప్పుడు మాత్రమే వీడియో ప్లే అవుతుంది.

ఇప్పుడు మీరు సుదీర్ఘమైన వీడియోను ప్లే చేస్తుంటే, చూసే వేగం కంటే స్ట్రీమింగ్ వేగం మెరుగ్గా లేకుంటే, మీరు ఈ బఫరింగ్ సెషన్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

బఫరింగ్ను పరిష్కరించడానికి మీరు ఏం చేయవచ్చు

బఫరింగ్కు అనేక కారణాలు ఉన్నాయి. చాలా రకాలైన అంశాలు ఈ సమస్యకు కారణం కావచ్చు. మేము చాలా సాధారణమైన వాటితో జాబితాను రూపొందించాం. దీని ద్వారా సమస్య తగ్గించుకోవచ్చు. మీరు జాబితాను అనుసరించవచ్చు, ఇది ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంది లేదా అది సమస్యను పరిష్కరిస్తుందో లేదో చూడవచ్చు.

హై-స్పీడ్ ఇంటర్నెట్ను పొందడం

వీడియోలు బఫరింగ్ కాకుండా ఉండటానికి ఇది స్పష్టమైన పరిష్కారం. ఇబ్బందులు లేకుండా వీడియోలను ప్రసారం చేయడానికి మీ ఇంటర్నెట్ వేగం తగినంతగా లేనప్పుడు, మీరు మీ ఇంటర్నెట్ డేటా ప్లాన్ను అప్గ్రేడ్ చేసి, అధిక వేగం లేదా ఎక్కువ డేటాను పొందడం అనేది ఈ సమస్యకు ముఖ్య పరిష్కారం.

అయితే, చాలా సార్లు, మీరు హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్ను కలిగి ఉన్నప్పటికీ బఫరింగ్ సమస్యను ఎదుర్కొంటారు.

ఇలా ఎందుకు?

DNS సర్వర్ నెమ్మదిగా ఉండటం లేదా మీ కేబుల్ లైన్లో సిగ్నల్ తక్కువగా ఉండటం దీనికి కారణం కావచ్చు. అలాంటప్పుడు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను మార్చాలి. మీ ప్రాంతంలో వేగవంతమైన ఇంటర్నెట్ను అందించే వారిని ఎంచుకోవాలి.

హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి, వీడియో గేమ్లు, వీడియోలు ప్లే అయ్యే సమయంలో బఫరింగ్ సమస్యలను నివారించడానికి ప్రత్యేకంగా రూపొందించిన ప్లాన్ను ఎంచుకోవడం మరొక ఎంపిక. ఉదాహరణకు, యాక్ట్ (ACT), ఆన్-డిమాండ్ స్పీడ్ బూస్ట్లతో (300 MBPS), అలాగే ఆన్-డిమాండ్ డేటా బూస్ట్లతో (1800 GB వరకు) ప్రత్యేక గేమింగ్ ప్యాక్ను కలిగి ఉంది. హై-రిజల్యూషన్ గేమ్లను ఆడుతున్నప్పుడు లేదా మీకు ఇష్టమైన షోలను ఎక్కువగా చూడటానికి మీకు ప్రత్యేకంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అవసరమైనప్పుడు, మీరు ఎప్పుడైనా మీ ఆన్-డిమాండ్ స్పీడ్ బూస్ట్ లేదా డేటా బూస్ట్కు మారవచ్చు.

మీ పరికరంలో నడుస్తున్న ఇతర యాక్టివ్ డౌన్లోడ్లు లేదా ప్రోగ్రామ్లను ఆపివేయండి

మీ ఇంటర్నెట్ వేగాన్ని పెంచడానికి ఇది తాత్కాలిక మార్గం. మీ వీడియో స్ట్రీమింగ్ నెమ్మదిగా ఉండటానికి కారణం మీ పరికరాల్లో ఇతర భారీ ప్రోగ్రామ్లు రన్ అవుతుండటం లేదా ఐటెమ్లను డౌన్లోడ్ చేయడం కూడా కావచ్చు. మీరు మీ అన్ని ఇనాక్టివ్ పరికరాలను - డెస్క్టాప్, టాబ్లెట్లు, మొబైళ్లు - మీ ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ మొత్తం మీ వీడియోకు తగ్గట్టుగా రన్ అవుతున్నట్లు నిర్ధారించుకోండి.

వీడియోను కాసేపు తాత్కాలికంగా ఆపండి

మీ వీడియోను అంతరాయం లేకుండా చూసేందుకు ఇది మరొక చక్కటి పరిష్కారం. వీడియోను కాసేపు తాత్కాలికంగా ఆపి (పాజ్ చేసి), ప్రసారం చేయనివ్వండి. దీన్ని మళ్లీ ప్లే చేయండి, ఆశాజనక, స్ట్రీమింగ్ వేగం, చూసే వేగం మధ్య తగినంత గ్యాప్ ఉంటుంది. తద్వారా మీరు మళ్లీ బఫరింగ్ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

వీడియో చూసే సమయాన్ని మార్చండి

ఇది ఎల్లప్పుడూ మీ ఇంటర్నెట్ స్పీడ్ సమస్య కాకపోవచ్చు - మీరు ఉపయోగిస్తున్న OTT ప్లాట్ఫామ్ (నెట్ ఫ్లిక్స్, జీ5, హాట్ స్టార్ మొదలైనవి) సర్వర్లు బిజీగా ఉండటం వల్ల కావచ్చు. ఈ ప్లాట్ఫామ్ల సర్వర్లు సాధారణంగా రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో ఓవర్లోడ్ చేయబడతాయని పరిశోధనల్లో తేలింది. కాబట్టి మీరు మీకు ఇష్టమైన టీవీ షోను చూడటానికి వేరే సమయాన్ని ఎంచుకోవచ్చు!

వేరే వై-ఫై రౌటర్ను ఉపయోగించండి

సరైన రౌటర్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ రౌటర్ అదనపు బ్యాండ్విడ్త్తో 5GHz నెట్వర్క్ను అందిస్తుంది. రౌటర్ నిజంగా మీ ఇంటర్నెట్ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. మీకు స్ట్రీమింగ్కు అత్యంత అనుకూలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే, డ్యుయల్-బ్యాండ్ వై-ఫై రౌటర్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఈ రౌటర్ అదనపు బ్యాండ్విడ్త్తో 5GHz నెట్వర్క్ను అందిస్తుంది.

వైరస్ ఉందో చెక్ చేయండి

హానికరమైన సాఫ్ట్వేర్ ద్వారా మీ పరికరం నెమ్మదిస్తుందో లేదో తనిఖీ చేయడానికి యాంటీ-వైరస్ లేదా యాంటీ-మాల్వేర్ సాఫ్ట్వేర్ను ఉపయోగించండి. ఈ రకమైన క్లీనప్ మీ ఇంటర్నెట్ వేగాన్ని గణనీయంగా పెంచడంలో మీకు సహాయపడుతుంది.

తాత్కాలికంగా వైర్ కనెక్షన్కు మారండి

వైర్లెస్ కనెక్షన్లలో కొన్నిసార్లు పలు కారణాల వల్ల అంతరాయం కలిగించవచ్చు - ఫ్రీక్వెన్సీ సమస్యల నుంచి సిగ్నల్ వరకు, భౌతిక అవరోధాల వరకు. కాబట్టి వైర్ కనెక్షన్కు మార్చడానికి ప్రయత్నించండి. అది బఫరింగ్ సమస్యను పరిష్కరిస్తుందో లేదో చూడండి.

మీ ఇంటర్నెట్ కనెక్షన్లోని పరికరాల సంఖ్యను చెక్ చేయండి

ఒకే ఇంటర్నెట్ కనెక్షన్లో అనేక పరికరాలను ప్లగ్ చేయడం వల్ల నెట్వర్క్ బ్యాండ్విడ్త్ వినియోగించబడవచ్చు, ప్రత్యేకించి రౌటర్ భారీ ట్రాఫిక్ లోడ్కు సపోర్ట్ ఇవ్వలేకపోతే. మీరు వీడియోను స్ట్రీమింగ్ చేస్తుంటే, మీరు ఇంటర్నెట్ వినియోగాన్ని ఆ పరికరం పరిమితం చేయగలరో లేదో చూడటానికి ప్రయత్నించండి.

బఫరింగ్ అనేది మనలో చాలామందికి సంబంధించిన అత్యంత నిరాశపరిచే సమస్యల్లో ఒకటి. మీరు దీర్ఘకాలంలో బఫరింగ్ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటే, నిజంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను పొందడమే మీకు ఉత్తమం.

మీ వైఫై వేగాన్ని పెంచుకోవడానికి చిట్కాలు, ఉపాయాలను ఇక్కడ చదవండి.

Read tips and tricks to increase your wifi speed here

Related blogs

13

4 minutes read

How to find Wifi Password of the connected device?

Read more

23

4 minutes read

Benefits of Wi-Fi 6 for Business

Read more

6

4 minutes read

How To Choose the Best Broadband Connection in Hyderabad?

Read more
How may i help you?