మీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలి?
-
0
-
-
4 minutes
ఇంటర్నెట్ మన జీవితంలోని దాదాపు ప్రతి అంశాన్ని జయించింది. వర్చువల్ ప్రపంచంగా పేరుగాంచిన, ఇంటర్నెట్ ఒక అవసరంగా మారింది. రోజువారీ సమాచారం కోసం 3.5 బిలియన్లకు పైగా ప్రజలు దానిపై ఆధారపడతారు. ఇంటర్నెట్ అనేది మొబైల్ నెట్ వర్క్ లు మరియు ల్యాన్ కనెక్షన్ ల ద్వారా లభిస్తున్నా కానీ, ఏదీ బ్రాడ్ బ్యాండ్ వేగానికి సమానం కాదు. ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ అంతకంతకు బలపడుతుండగా, ఇటీవల ప్రచారం సంచరించుకుంది.
మీరు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ని అత్యంత సమర్థవంతంగా ఎలా ఉపయోగించవచ్చని ఆలోచిస్తున్నారా? మీ సబ్ స్క్రిప్షన్ ని మీరు పూర్తి స్థాయిలో ఎలా ఆస్వాదించవచ్చో తెలుసుకోవడం కోసం చివరి వరకు స్క్రోల్ చేస్తూ ఉండండి.
What is broadband?
బ్రాడ్ బ్యాండ్ అంటే ఏమిటి?
బ్రాడ్ బ్యాండ్ ఉపయోగించడానికి అత్యుత్తమ మార్గాల గురించి తెలుసుకోవడానికి ముందు, నెట్ వర్క్ కమ్యూనికేషన్ యొక్క ఈ రూపాన్ని మనం ముందుగా తెలుసుకుందాం. బ్రాడ్ బ్యాండ్ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించే మాధ్యమం మరియు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అందించడంలో ప్రసిద్ధి చెందింది. ఇది మీకు స్థిరమైన కనెక్షన్ ని అందిస్తుంది మరియు మీకు కావాల్సిన సమాచారాన్ని మీ చేతి వెళ్ల దూరంలో ఉంచుతుంది.
Tips to use your broadband connection effectively
మీ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ని సమర్థవంతంగా ఉపయోగించడానికి చిట్కాలు
1. Look up information and browse websites
1. సమాచారాన్ని చూడండి మరియు వెబ్ సైట్ లను బ్రౌజ్ చేయండి
మీ సందేహాలను పరిష్కరించడానికి మీరు నిపుణుడిని కనుక్కోవాల్సిన రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజల్లో మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం ద్వారా మీ సందేహాలను సులభంగా నివృత్తి చేసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్లు మీరు వెతుకుతున్న ప్రతి దానిని కలిగి ఉంటాయి. అది ప్రయాణానికి సంబంధించినది కావచ్చు, వంట రెసిపీ అయి ఉండవచ్చు, మేకప్ ట్రిక్స్, పాపులర్ హాక్స్, వైద్య వివరణలు, అధ్యయన సంబంధిత అంశాలు, జాబ్ సెర్చ్, సర్టిఫికేషన్ లేదా మధ్యలో ఇంకేమైనా.
గూగుల్ లేదా ఏదైనా ఇతర పాపులర్ సెర్చ్ ఇంజిన్ లో మీరు ఏమి ఆలోచిస్తున్నారో దానిని టైప్ చేయండి మరియు రెప్పపాటులో సరైన సమాచారాన్ని పొందుతారు. 24 గంటలూ మీకు సహాయపడటానికి ఇంటర్నెట్ ఉన్నందున మీకు విషయాలు బోధించగల వ్యక్తి కోసం బయటకు వెళ్లి వెతకాల్సిన అవసరం లేదు. మీ సమయం మరియు ప్రయత్నాలను తగ్గించడానికి మీకు తెలిసినట్లయితే, నిర్ధిష్ట వెబ్ సైట్ యొక్క URLని కూడా మీరు సెర్చ్ ఇంజిన్ బాక్స్ లో నమోదు చేయవచ్చు. ఇది మిమ్మల్ని నేరుగా వెబ్ సైట్ నిర్ధిష్ట పేజీకి తీసుకువెళుతుంది మరియు మీ అన్ని ప్రశ్నలను ఏ సమయంలోనైనా పరిష్కరిస్తుంది.
2. Enjoy your favorite movies, music and web series online
2. మీకు ఇష్టమైన సినిమాలు, సంగీతం మరియు వెబ్ సిరీస్ లను ఆన్ లైన్ లో ఆస్వాదించండి
భూమి మీద తమకిష్టమైన సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడటానికి ఎవరు మాత్రం ఇష్టపడరు? ఇంటర్నెట్ మాత్రమే దానిని సాధ్యమయ్యేలా చేయగల మాధ్యమం. టెలివిజన్ లో మీకు ఇష్టమైన సినిమా లేదా షో చూడటానికి వారాంతం వరకు మీరు వేచి ఉండాల్సిన రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో మీరు మీ అత్యంత ఇష్టపడే సినిమాలకు కేవలం ఒక్క క్లిక్ దూరంలో ఉన్నారు. అలాగే ప్రతిరోజూ ఒక కొత్త వెబ్ సిరీస్ విడుదలయ్యే ఓటిటి ప్లాట్ ఫాంల యుగంలో మనం ఉన్నాం మరియు హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ మాత్రమే దీనిని ఆస్వాదించడానికి మీకు సహాయపడుతుంది.
ఇంటర్నెట్ మీకు విస్తృత శ్రేణి అవకాశాలను అందిస్తుంది మరియు మీ ఎంటర్టైన్మెంట్ కోరికలను తీర్చడానికి వెబ్ సైట్ ఉచిత లేదా చెల్లింపు వర్షన్ ను ఎంచుకోవచ్చు. ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ కంటెంట్ ని ఆన్ లైన్ లో స్ట్రీమ్ చేయడానికి లేదా తర్వాత చూడటానికి డౌన్ లోడ్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు ఇష్టమైన సంగీతం మరియు సినిమాలను ఆన్ లైన్ లో ఆస్వాదించడం అనేది మీ బ్రాడ్ బ్యాండ్ సబ్ స్క్రిప్షన్ ఉపయోగించడానికి అత్యుత్తమ మార్గం.
3. Download or upload files on the go
3. ఫైల్స్ ని డౌన్ లోడ్ లేదా అప్ లోడ్ చేయండి
ఇమేజ్ లు, వీడియోలు, మ్యూజిక్, పీడీఎఫ్ లు మరియు మరెన్నో డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ అంతులేని ఫైల్స్ ని కలిగి ఉంది. అయితే మీరు బ్రాడ్ బ్యాండ్ తో మాత్రమే వాటిని డౌన్ లోడ్ చేయడం లేదా అప్ లోడ్ చేయడాన్ని ఆస్వాదించవచ్చు. పెన్ డ్రైవ్ లు మరియు ఫ్లాష్ డిస్క్ ల ద్వారా సమాచారం మరియు మీడియా కంటెంట్ ను షేర్ చేయడానికి మీరు వాడి ఉండవచ్చు.కానీ ఇప్పుడు అలా కాదు! ఈ రోజు ఈ పనులను గూగుల్ డ్రైవ్ మరియు ఇమెయిల్స్ ద్వారా ఆన్ లైన్ లో చేయవచ్చు. ఇంటర్నెట్ వేగం గురించి ఆందోళన చెందకుండా ఆన్ లైన్ స్టోరేజీని ఉపయోగించండి మరియు డౌన్ లోడ్ చేసుకోండి మరియు మీకు ఇష్టమైన ఫైల్స్ ను చిటికెలో అప్ లోడ్ చేయండి. అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని ఆస్వాదించడానికి మెరుగైన మరియు హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ ని ఎంచుకోవడం మంచిది.
4. Communicate with your near and dear ones through video conferencing
4. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీ సన్నిహితులు మరియు ప్రియమైన వారితో కమ్యూనికేట్ చేయండి
బ్రాడ్ బ్యాండ్ కేవలం సమాచారాన్ని బ్రౌజ్ చేయడం లేదా ఇమెయిల్స్ పంపడానికి మాత్రమే కాదు, ఇవి ప్రధానంగా మిమ్మల్ని అసంఖ్యాక అవకాశాల ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి పరిచయం చేయబడతాయి. ఇక్కడ మీరు ప్రతిదీ రియల్ టైంలో ఆస్వాదించవచ్చు. ఇంటర్నెట్ అనేక విధాలుగా కనెక్ట్ కావడానికి అనుమతించడం ద్వారా వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించింది. అలాంటి వాటిలో ఒకటి వీడియో కాన్ఫరెన్సింగ్. మీ కుటుంబం మరియు స్నేహితులతో అంతులేని వీడియో కాల్స్ ను ఆస్వాదించండి మరియు దూరం గురించి మరచిపోండి. జూమ్, స్కైప్, గూగుల్ మీట్ మరియు మరెన్నోవీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ ఫాంలు మీ సమీప మరియు ప్రియమైన వారి వద్దకు ఏ సమయంలోనైనా మిమ్మల్ని తీసుకెళ్లగలవు.
5. Enjoy online shopping
5. ఆన్లైన్ షాపింగ్ ని ఆనందించండి
మీరు షాపింగ్ ని ఇష్టపడతారా? అయితే బయటకు వెళ్లడానికి తగినంత సమయం లేదా? చింతించకండి, ఇప్పుడు మీరు మీ మంచం మీది నుండే షాపింగ్ ఆనందాన్ని ఆస్వాదించగలరు. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కు ధన్యవాదాలు. మీకు ఇష్టమైన షాపింగ్ సైట్ లను ఆన్ లైన్ లో బ్రౌజ్ చేయండి. మీకు ఇష్టమైన ఉత్పత్తులను ఎంచుకోండి. ఆన్ లైన్ లావాదేవీని చేయండి మరియు మీ ఇంటి వద్దనే సంతోషాన్ని ఆవిష్కరించుకోండి.
Conclusion
ముగింపు
బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు మన జీవితాల్లో అంతర్భాగమైంది మరియు దానిని ఎలా ఉత్తమంగా ఉపయోగించాలనే విషయానికి వస్తే ఆప్షన్లకు కొరత లేదు. మీ ఇంటర్నెట్ కనెక్షన్ ని సాధ్యమైనంత అత్యుత్తమ రీతిలో ఉపయోగించుకోండి మరియు అవకాశాల వర్చువల్ ప్రపంచాన్ని స్వాగతించండి. ఒకవేళ అంతరాయం లేని మరియు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం మీరు ఖచ్చితంగా వెతుకుతున్నట్లయితే, ఇప్పుడే ACT ఫైబర్ నెట్ తో కనెక్ట్ అవ్వండి మరియు సబ్ స్క్రిప్షన్ లను ఆస్వాదించండి.