ఇంటర్నెట్ సర్వీసులను ఎలా ప్రారంభించాలి?
-
0
-
-
4 minutes
చాలా వ్యాపారాలు మరియు ఇంటి పనులకు ఇంటర్నెట్ అనేది ఇతర అవసరాల మాదిరిగా ప్రాథమిక అవసరంగా మారింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లు ఇంటర్నెట్ ని ఉపయోగించడం, యాక్సెస్ చేసుకోవడానికి లేదా ఇంటర్నెట్ లో జాయిన్ అవడానికి సేవలను అందించే సంస్థలు. ఒకవేళ మీరు ఒక కస్టమర్ గా ఇంటర్నెట్ సర్వీస్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే, మీరు ISP నుంచి తప్పకుండా కనెక్షన్ ని కోరాలి. ఇంటర్నెట్ సర్వీస్ కనెక్షన్ కోరడం వల్ల వివిధ అవకాశాలు మరియు వనరులకు కనెక్ట్ కావడానికి మీకు అవకాశం, అనుమతి లభిస్తుంది. ఈ ఆర్టికల్ ఇంటర్నెట్ సేవను ఎంచుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలను మీకు అర్థమయ్యేలా చేస్తుంది.
Benefits of Internet Service
ఇంటర్నెట్ సర్వీస్ వల్ల ప్రయోజనాలు
ఇంటర్నెట్ అనేది బిలియన్ల కొద్దీ సిస్టమ్ లు మరియు ఎలక్ట్రానిక్ డివైస్ ల గ్లోబల్ ఇంటర్ కనెక్షన్. ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా యూజర్లు దాదాపు ఏ సమాచారాన్నైనా షేర్ చేసుకోవచ్చు మరియు యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం పొందడానికి కస్టమర్ కనెక్ట్ చేయాల్సిన నిర్ధిష్ట పరికరాలు ఉన్నాయి. మీరు మీ ఇంటికి లేదా మీ ఆఫీస్ కి ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవాలనుకుంటే, మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుండి ఇంటర్నెట్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కేబుల్ కంపెనీగా, ఫోన్ కంపెనీగా లేదా ప్రభుత్వ పరంగా ఉండే అవకాశం ఉంది. మీకు రూటర్లు, ల్యాన్ కేబుల్స్, మోడెమ్ లు, స్విచ్ లు మొదలైన ఇతర పరికరాలు అవసరం కావచ్చు.
Different Factors to Consider Before Choosing an Internet Service
ఇంటర్నెట్ సర్వీస్ ని ఎ౦చుకునే ము౦దు పరిగణించాల్సిన వివిధ కారకాలు
The Business Aspects
వ్యాపార అంశాలు
మీరు ఎంచుకున్న ఇంటర్నెట్ కనెక్షన్ తో మీరు స్థానిక లేదా ప్రపంచస్థాయి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు మొత్తం బడ్జెట్ ని మరియు ఇంటర్నెట్ సేవకు అవసరమైన పరికరాలను ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఒక కస్టమర్ గా మీరు త్వరిత మరియు చిరాకు లేని ఇంటర్నెట్ కనెక్షన్ కోసం నాణ్యమైన వస్తువులను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు తర్వాత చేయాల్సింది, ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ కొనుగోలు చేయాలనుకుంటున్న ISPని కనుగొనడం. మీ ఇంటర్నెట్ సర్వీస్ ను ఆస్వాదించడం ప్రారంభించడానికి మీరు ACT ఫైబర్ నెట్ లాంటి కంపెనీలను పరిగణలోకి తీసుకోవచ్చు. బ్యాండ్ విడ్త్ మరియు హార్డ్ వేర్ యొక్క ఖచ్చితమైన సరఫరాదారులను అర్థం చేసుకోవడానికి మీరు నిపుణుల నుండి గైడెన్స్ కూడా పొందాలి. అలాగే మీ నగరం లేదా రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ మరియు హార్డ్ వేర్ యొక్క తక్షణ సరఫరా గురించి కూడా మీ వ్యాపారాన్ని ప్లాన్ చేసేటప్పుడు మీరు గుర్తించుకోవాలి. ప్రకృతి లేదా కృత్రిమ విపత్తుల వల్ల కలిగే ఏవైనా నష్టాలు మరియు డిస్కనెక్టివిటీలకు తక్షణ పరిష్కారాన్ని అందించాల్సి ఉంటుంది.
The Technical Aspect
సాంకేతిక అంశాలు
ఏ ఇంటర్నెట్ సర్వీస్ లో అయినా ఇది అత్యంత క్లిష్టమైన అంశం. మీరు ఎంచుకున్న ఇంటర్నెట్ సర్వీస్ అనేది అందించే బ్యాండ్ విడ్త్ ప్లాన్ లతో పాటు మీ ప్రాంతంలో సేవలందించే ISPలపై ఆధారపడి ఉంటుంది. ఇంటర్నెట్ సేవల కొన్ని సాధారణ రకాలు-
డయల్-అప్: ఇది సంప్రదాయ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు అత్యంత నెమ్మదైన కనెక్టివిటీ. మీ ప్రాంతంలో లభించే సర్వీస్ ఇది మాత్రమే అయితే తప్ప మీరు దాని గురించి చూడకండి. ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి ఇది మల్టిపుల్ ఫోన్ లైన్లు లేదా ల్యాండ్ లైన్ కనెక్షన్ ని ఉపయోగిస్తుంది.
DSL: డయల్-అప్ లైన్ లతో పోలిస్తే ఈ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ వేగంగా ఉంటుంది. ఇది ఫోన్ లైన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తున్నప్పటికీ, ఇది స్లో ల్యాండ్ లైన్ ను డయల్-అప్ సేవగా ఉపయోగించదు.
శాటిలైట్ కనెక్షన్: ఇది బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ టెక్నిక్ ని ఉపయోగిస్తుంది కానీ కేబుల్ లేదా ఫోన్ లైన్లను ఉపయోగించదు. ఇంటర్నెట్ సర్వీస్ అందించడానికి ఇది వైర్ లెస్ మాధ్యమాన్ని ఉపయోగిస్తుంది. అటువంటి కనెక్షన్ లు వాతావరణ ప్రభావానికి గురికావచ్చు.
3G మరియు 4G: ఇవి ఆధునిక ISP యొక్క ఆధునిక ఇంటర్నెట్ సేవా పద్ధతులు. ఇది ISP యొక్క నెట్ వర్క్ ద్వారా కస్టమర్లను వైర్ లెస్ గా కనెక్ట్ చేస్తుంది. ఈ రకమైన నెట్ వర్క్ లు సెల్యులార్ ఫోన్లు మరియు స్మార్ట్ ఫోన్ లతో పాపులర్ అయ్యాయి.
రూటర్ మరియు మోడెమ్ లను ఎనేబుల్ చేయడం ద్వారా మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం ISP యొక్క బాధ్యత. హార్డ్ వేర్ మరియు ఇంటర్నెట్ సర్వీస్ మోడల్స్ తోపాటుగా, వెబ్ సైట్ లకు కనెక్ట్ కావడానికి మరియు వీక్షించడానికి మీకు వెబ్ బ్రౌజర్ మరియు సిస్టమ్ లేదా PC కూడా అవసరం అవుతుంది. వెబ్ బ్రౌజర్ అనేది ఒక అప్లికేషన్, ఇది దాని యూజర్ లు ఇంటర్నెట్ లోని నిర్ధిష్ట సమాచారం మరియు వెబ్ పేజీలను యాక్సెస్ చేసుకోవడానికి దోహదపడుతుంది. ఇంటర్నెట్ లేదా మనం సందర్శించే వెబ్ సైట్ కు కనెక్ట్ చేయబడ్డ ప్రతి కంప్యూటర్ కు ఒక ప్రత్యేక చిరునామా ఉంటుంది. ఈ చిరునామాను మీ వెబ్ బ్రౌజర్ లో టైప్ చేయడం ద్వారా, మీరు ఆ వెబ్ సైట్ లను యాక్సెస్ చేసుకోవచ్చు. హెచ్ టిఎమ్ ఎల్(HTML) లో రాయబడ్డ వెబ్ సైట్ లను డిస్ ప్లే చేయడానికి బ్రౌజర్ బాధ్యత వహిస్తుంది.
Conclusion
ముగింపు
సర్వీస్ ప్రొవైడర్ ని ఎలా చేరుకోవాలనే దానిపై స్పష్టమైన అవగాహన పొందడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయపడుతుందని మేం ఆశిస్తున్నాం. అదే విధంగా, సర్వీస్ ని కోరుకునేటప్పుడు వేటిని పరిగణలోకి తీసుకోవాలనే దాని గురించి కూడా ఇది వివరిస్తుంది. మీ ఇంటర్నెట్ సర్వీస్ ని సెటప్ చేయడం అనేది ఏదైనా వ్యాపారం యొక్క అత్యావశ్యక దశ. నేడు దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ఆఫీసులు మరియు వ్యాపారంలో ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారు. క్లౌడ్ లో డేటాను నిల్వ చేయడం నుండి ఆన్ లైన్ వనరుల కోసం సెర్చ్ చేయడం వరకు, ప్రతి దానికి ఇంటర్నెట్ అవసరం. ఒకవేళ మీరు ఇంటర్నెట్ సర్వీస్ కనెక్షన్ కొరకు చూస్తున్నట్లయితే, ACT ఫైబర్ నెట్ అనేది అత్యుత్తమ ఆప్షన్. 19 నగరాల్లో ఉన్న భారతదేశంలోని ప్రముఖ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ గా, ACT మీ ప్రతి అవసరానికి అనుగుణంగా వివిధ రకాల బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లను అందిస్తుంది.
మీరు వై-ఫై కనెక్షన్ అవసరమైన వ్యక్తి అయినా లేదా కంపెనీ అయినా, ప్రతిదీ ACT ఫైబర్ నెట్ యొక్క బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ కింద కవర్ చేయబడుతుంది. అవి అపరిమిత బ్రాడ్ బ్యాండ్ మరియు డేటా-నిర్దిష్టమైన వై-ఫై ప్లాన్లు వంటి ప్రత్యేక ప్యాకేజీలతో వస్తాయి. వీటిలో మీ అవసరాలకు అనుగుణంగా మీరు ఎంచుకోవచ్చు.