Footer Bottom Menu

బ్రాడ్‌బ్యాండ్ అంటే ఏమిటి?

  • 0

  • 8 minutes

ప్రస్తుత రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఆఫీసులో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. ప్రజలు వెబ్లో బ్రౌజ్ చేసేందుకు, సినిమాలు చూసేందుకు, మరియు టెలివిజన్ షోల కోసం, ఈమెయిల్స్ చెక్ చేసుకునేందుకు, మెస్సేజులు చూసుకునేందుకు స్నేహితులు, కుటుంబసభ్యులతో కనెక్ట్ అయి ఉండేందుకు ఇంకా అనేక పనుల కోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తారు. నేటి రోజుల్లో మానవ జీవితాలు పూర్తిగా ఇంటర్నెట్పై ఆధారపడి ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐదు నిమిషాల పాటు ఇంటర్నెట్ సర్వీసెస్ నిలిచిపోతే ప్రజలు అల్లాడిపోతారు. సర్వీసెస్ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతాయని తెలుసుకునేందుకు వారు వెంటనే వారి ఇంటర్నెట్ ప్రొవైడర్ను సంప్రదిస్తారు.

కానీ మన నిత్య జీవితాల్లోకి ఇంత సులభంగా ఇంటర్నెట్ వచ్చేలా చేసిన దాని గురించి మనం అస్సలు పట్టించుకోవడం లేదు. అదేంటో కూడా చాలా మందికి తెలియదు. కానీ అదే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఏమిటి? అందులో ఉండే వివిధ రకాలు ఏమిటి? వివిధ అవసరాలు ఉండే ప్రజలకు అది ఎందుకు అవసరం పడుతుంది? బెస్ట్ బ్రాడ్బ్యాండ్ ప్యాకేజీని ఎలా ఎంచుకోవాలి?

మరింత తెలుసుకుందాం..
బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అంటే ఏమిటి?

బ్రాడ్బ్యాండ్ను హై-స్పీడ్ ఇంటర్నెట్ అని కూడా పిలుస్తారు. ఇది డయల్ అప్ కనెక్షన్ల కంటే కూడా వేగాన్ని అందించే మరియు ఎప్పుడూ ఆన్లో ఉండే ఇంటర్నెట్ కనెక్షన్. ఇది సాంప్రదాయక డయల్ అప్ కనెక్షన్ల కంటే వేగంగా వెబ్ బ్రౌజ్ చేసేందుకు, వీడియోలు ప్లే చేసేందుకు, పెద్ద ఫైల్స్ డౌన్లోడ్ చేసేందుకు, అంతే కాకుండా వాయిస్ మరియు వీడియో కాల్స్ చేసేందుకు వినియోగదారులను అనుమతించే ఒక రకమైన ఇంటర్నెట్ కనెక్షన్. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు సాధారణంగా కేబుల్, ఫైబర్ ఆప్టిక్, DSL (డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్) ద్వారా అందించబడతాయి.

బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు సాధారణంగా గృహాలు, వ్యాపారాల కోసం ఎంచుకుంటారు. ఎందుకంటే ఇవి డయల్ అప్ కనెక్షన్లతో పోల్చుకుంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అంతే కాకుండా బ్రాడ్బ్యాండ్ అధిక వేగాన్ని, ఎక్కువ విశ్వసనీయ సర్వీసును అందిస్తుంది. దీనిని సెటప్ చేయడం, ఉపయోగించడం చాలా సులభం. దీనిని ఉపయోగించి పెద్ద ఫైల్లను డౌన్లోడ్ చేసేందుకు తక్కువ సమయం పడుతుంది. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు డయల్ అప్ కంటే ఎక్కువ సురక్షితమైనవి. అంతే కాకుండా ఏక కాలంలో ఒకటి కంటే ఎక్కువ పరికరాలను యాక్సెస్ చేసేందుకు వీటిని ఉపయోగించొచ్చు.

వైర్డ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లోని రకాలు ఏమిటి?

బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు ఉపయోగించే టెక్నాలజీని బట్టి వివిధ రకాల వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్లుగా లభిస్తాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందించే అత్యంత ప్రజాదరణ పొందిన వైర్డ్ కనెక్షన్స్:

కేబుల్ బ్రాడ్బ్యాండ్

కేబుల్ బ్రాడ్బ్యాండ్ 100 Mbps హై స్పీడ్ను అందిస్తుంది. పెద్ద ఫైల్లను డౌన్లోడ్ చేసేందుకు మరియు మీడియా స్ట్రీమింగ్ కోసం ఇది ఉపయోగించబడుతుంది. ఇది ఇంటర్నెట్ యాక్సెస్ని అందించేందుకు కేబుల్ నెట్వర్క్ని ఉపయోగిస్తుంది. కాబట్టి ఈ రకమైన బ్రాడ్బ్యాండ్ను ఉపయోగించేందుకు కేబుల్ కనెక్షన్ అవసరం.

ఫైబర్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్

ఫైబర్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ అనేది వేగవంతమైన కనెక్షన్ రకం. 1 Gbps వరకు స్పీడ్ను అందిస్తుంది. ఇది ఇంటర్నెట్ను అందించేందుకు ఆప్టికల్ ఫైబర్లు, కాపర్ వైర్లను ఉపయోగిస్తుంది. ఫైబర్ ఇంటర్నెట్ ఇతర రకాల బ్రాడ్బ్యాండ్ కంటే ఎక్కువ స్పీడ్ను కలిగి ఉంటుంది. ఎక్కువ నమ్మదగినది.

ఫైబర్ ఇంటర్నెట్ అనేది భవిష్యత్ ఇంటర్నెట్. ఇతర రకాల వైర్డ్ మరియు wవైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్లతో ఇది మరింత విశ్వసనీయమైన, వేగవంతమైన కనెక్షన్ను అందిస్తుంది. అందువల్ల ఎవరైతే వినియోగదారులు కొత్త ఇంటర్నెట్ కనెక్షన్ కోసం చూస్తారో వారు ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఎంచుకోవాలి.

DSL బ్రాడ్బ్యాండ్

బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్లో అత్యధికంగా ఉపయోగించే బ్రాడ్బ్యాండ్ రకం DSL. ఇది 100 Mbps వరకు స్పీడ్ను అందిస్తుంది. ఇది ఫోన్లైన్ ద్వారా ఇంటర్నెట్ను అందించేందుకు డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ టెక్నాలజీ లేదా DSLను ఉపయోగిస్తుంది. ఈ రకమైన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కేబుల్ కంటే ఎక్కువ నమ్మదగినది. కానీ అంత వేగంగా ఉండదు.

వైర్డ్ కనెక్షన్లు మాత్రమే కాకుండా వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటర్నెట్ను అందించేందుకు వైర్లెస్ కనెక్షన్లు రేడియో సిగ్నళ్లను ఉపయోగిస్తాయి. మొబైల్ పరికరాలయిన టాబ్లెట్స్, మరియు స్మార్ట్ ఫోన్స్ వంటి పరికరాలకు ఇవి సరిగ్గా సూట్ అవుతాయి. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..

పవర్లైన్స్ ద్వారా బ్రాడ్బ్యాండ్

బ్రాడ్బ్యాండ్ ఓవర్ పవర్లైన్స్ (BOP) అనేది ఇంటర్నెట్ను అందించేందుకు ఉపయోగించే ఒక రకమైన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్. ఇది ఫైబర్ మరియు కేబుల్ కనెక్షన్ల కంటే మరింత చౌకగా ఉంటుంది. ఇది ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ డొమైన్లో కొత్త టెక్నాలజీ. అయితే దీని స్పీడ్ మరియు విశ్వసనీయత చూసుకుంటే ఇది ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. BPL యొక్క బెస్ట్ పార్ట్ ఏమిటంటే.. అవి ఇంటర్నెట్ యాక్సెస్ కోసం మౌలికసదుపాయాలకు అయ్యే ఖర్చును తగ్గిస్తుంది. విద్యుత్ సరఫరా కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లను వారు వాడుకోవడమే ఇందుకు కారణం.

వైర్లెస్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్లోని రకాలు ఏమిటి?

వైర్లెస్ ఇంటర్నెట్ అనేది ఇంటర్నెట్ యాక్సెస్ను అందించడం కోసం వైర్లెస్ నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది. ఇది సాధారణంగా టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్స్ వంటి మొబైల్ పరికరాల కోసం ఉపయోగించబడుతుంది. అంతే కాకుండా PCలు (పర్సనల్ కంప్యూటర్స్), TVలు, గేమ్ కన్సోల్ల కోసం కూడా ఉపయోగిస్తారు. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన రకాలు:

వైఫై (Wi-Fi)

Wi-Fi అనేది సాధారణంగా ఉపయోగించే వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్.ఇది 1300 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ పరికరాల మధ్య డేటాను ప్రసారం చేసేందుకు ఇది రేడియో తరంగాలను ఉపయోగిస్తుంది. వాటిని కేబుల్ ద్వారా కనెక్ట్ చేయకుండానే ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. చాలా మంది వినియోగదారులు బహిరంగ ప్రదేశాలయిన కేఫ్స్, మరియు విమానాశ్రయాల్లో Wi-Fi ద్వారా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేస్తారు.

3జీ/4జీ(3G/4G)

3G మరియు 4G అనేవి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సేవలు. ఇంటర్నెట్ యాక్సెస్ కొరకు ఇవి మొబైల్ డేటాను ఉపయోగిస్తాయి. టాబ్లెట్స్, స్మార్ట్ఫోన్ల వంటి మొబైల్ పరికరాల కోసం వీటిని ఉపయోగిస్తారు. ఇవి 100 Mbps వరకు వేగాన్ని అందిస్తాయి.

3G సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అనేక మొబైల్ ప్రొవైడర్లు 4G సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. 4G అనేది 3G కంటే ఎక్కువ నమ్మదగిన స్పీడ్ను మీకు అందిస్తుంది. రోజూవారీ వినియోగానికి ఇది సరైనదిగా ఉంటుంది.

5జీ (5G)

5G వైర్లెస్ టెక్నాలజీ అనేది వైర్లెస్ ఇంటర్నెట్ సేవల్లో సరికొత్త విప్లవం. ఇది 10 Gbps వరకు వేగాన్ని అందిస్తుంది. ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. కానీ దీని ద్వారా మనం ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మాత్రం హామీ ఇచ్చారు. రోజులు గడిచే కొద్దీ ఇది మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న గృహాలు, ఆఫీసులకు ఇదే ప్రధాన ఇంటర్నెట్ కనెక్షన్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

శాటిలైట్

శాటిలైట్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ అనేది జియోసింక్రనైస్ కక్ష్యలో (భూమికి దగ్గరగా ఉన్న కక్ష్య) ఉన్న ఉపగ్రహం ద్వారా అందించబడుతుంది. ఇతర రకాలైన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది 100 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది.

స్టార్లింక్ అనేది స్పేస్X ఉపగ్రహం ద్వారా అందించబడుతున్న ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఇది గరిష్టంగా 200 Mbps వరకు వేగాన్ని అందిస్తుంది. ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో పరీక్షించబడుతుంది. నవంబర్ 2022 నాటికి స్టార్లింక్ ఇంటర్నెట్ 3271 ఉపగ్రహాలను కక్ష్యలో కలిగి ఉంది.

3271 satellites in orbit. ఇది US మరియు కెనడాలోని చాలా ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.

బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు వినియోగదారులకు విశ్వసనీయమైన, వేగవంతమైన, సురక్షితమైన ఇంటర్నెట్ యాక్సెస్ను కలిగి ఉంటాయి. వినియోగదారులు వారి అవసరాలకు ఏది సరైన విధంగా సరిపోతుందో తెలుసుకునేందుకు వివిధ రకాల వైర్డ్ మరియు వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లను చూసి నిర్ణయం తీసుకోవాలి.

ఉత్తమ బ్రాడ్బ్యాండ్ ప్యాకేజీని ఎలా ఎంచుకోవాలి?

బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ప్యాకేజీని ఎంచుకునేటపుడు కనెక్షన్ పని తీరును ప్రభావితం చేసే వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకోవడం చాలా ముఖ్యం. డౌన్లోడ్ మరియు అప్లోడ్ స్పీడ్స్, డేటా లిమిట్స్, కవరేజ్ ఏరియా, ధర, యూజర్ రివ్యూస్, కస్టమర్ సర్వీస్ మరియు టెక్నికల్ సపోర్ట్ వంటి కొన్ని కీలక అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి.

డౌన్లోడ్ మరియు అప్లోడ్ వేగాలు(స్పీడ్స్)

ఇంటర్నెట్ కనెక్షన్ యొక్క డౌన్లోడ్ మరియు అప్లోడ్ స్పీడ్స్ అనేవి పరిగణించాల్సిన ముఖ్యమైన అంశాలు. ఎక్కువ వేగం ఉంటే వినియోగదారులు సులభంగా ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయగలరు. వీడియోలను స్ట్రీమ్ చేయగలరు మరియు పెద్ద ఫైల్స్ను డౌన్లోడ్ చేయగలరు.

ఆదర్శమైన డౌన్లోడ్ వేగం 50 Mbps మరియు అప్లోడ్ వేగం 10 Mbps వరకు ఉండాలి. ఎక్కువ వేగం బెటర్ పర్ఫామెన్స్ను అందిస్తుంది. ప్రత్యేకించి ఒక్కరి కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఒకే నెట్వర్క్కు కనెక్ట్ అయి ఉన్నపుడు అధిక వేగం అనేది మీకు మెరుగైన పనితీరును అందిస్తుంది.

నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్నపుడు వాటి వేగాలు తగ్గే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వైర్లెస్ కనెక్షన్లు వైర్డ్ కనెక్షన్ల కంటే నెమ్మదిగా ఉంటాయి. అందువల్ల పీక్ అవర్స్లో లేదా ఒక వేళ Wi-Fiని ఉపయోగిస్తున్నా కూడా మంచి స్పీడ్ వచ్చే నెట్వర్క్ను ఎంచుకోండి.

డేటా పరిమితులు

ఇంటర్నెట్ ప్యాకేజీలను ఎంచుకునేటపుడు డేటా పరిమితులను గురించి తనిఖీ చేయడం ముఖ్యం. చాలా మంది ప్రొవైడర్లు అపరిమిత డేటాతో ప్యాకేజీలను అందిస్తారు. అయితే యూజర్స్ బడ్జెట్ విషయంలో వెనకడుగు వేస్తే పరిమిత డేటాతో వచ్చే ప్యాక్ను ఒకదానిని ఎంచుకోవాలని అనుకోవచ్చు.

ఇంటర్నెట్ ప్యాకేజీ కోసం రిజిస్టర్ చేసుకునే ముందు డేటా పరిమితిని ఒక సారి తనిఖీ చేసి.. మీ అవసరాలకు అది సరిపోతుందో లేదో సరి చూసుకోండి. సాధారణంగా వెబ్బ్రౌజింగ్, మరియు స్ట్రీమింగ్ వంటి అవసరాల కోసం నెలకు కనీసం100 GB డేటా ఉండాలి.

కవరేజ్ ఏరియా

ప్యాకేజీని ఎంచుకునేటపుడు బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ యొక్క కవరేజీని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. కొంత మంది ప్రొవైడర్లు దేశవ్యాప్త కవరేజీతో ప్యాకేజీలను అందిస్తారు. మరికొంత మంది నిర్దిష్ట ప్రాంతాల్లో పరిమిత కవరేజీని కలిగి ఉంటారు.

కనెక్షన్ రకం

ముందే చెప్పిన విధంగా DSL, కేబుల్, ఫైబర్ -ఆప్టిక్స్ వంటి వివిధ రకాల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రకంలో కొన్ని ప్రయోజనాలు, లోపాలు ఉన్నాయి. అందుకోసమే వినియోగదారులు కనెక్షన్ ఎంచుకునేటపుడు పరిశోధించి తమ అవసరాలకు సరిగ్గా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. వినియోగదారులు ఫాస్టర్ స్పీడ్ మరియు మెరుగైన విశ్వసనీయతను అందించే విధంగా ఫైబర్ -ఆప్టిక్ కనెక్షన్లను అందించే ISP (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) ఎంచుకోవాలి.

ధర

ఇంటర్నెట్ ప్యాకేజి ధర కూడా పరిగణలోనికి తీసుకోవాలి. సాధారణంగా కనెక్షన్ యొక్క అధిక వేగం ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఎక్కువ స్పీడ్ అందిస్తూ తక్కువ ధరకు వచ్చే కనెక్షన్ను యూజర్స్ ఎంచుకోవాలి.

యూజర్ రివ్యూలు (యూజర్ సమీక్షలు)

ఇంటర్నెట్ ప్యాకేజీని ఎంచుకునే ముందు యూజర్ రివ్యూలను కూడా చూడాలి. ఇప్పటికే వాడుతున్న యూజర్స్ ప్యాకేజీ పనితీరు, కస్టమర్ సర్వీస్, సపోర్ట్ గురించి ఇప్పటికే చూసి ఉంటారు కావున వారి సమీక్షలను పరిగణలోనికి తీసుకోవాలి. ఏ ప్రొవైడర్ను ఎంచుకోవాలనే విషయంలో యూజర్ రివ్యూలను చదవడం సహాయంగా ఉంటుంది. సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.

కస్టమర్ సర్వీస్ మరియు టెక్నికల్ సపోర్ట్

బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ప్యాకేజీని ఎంచుకునేటపుడు కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ వంటి విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. ఏవైనా సమస్యలు ఎదురైనపుడు నమ్మకమైన కస్టమర్ సర్వీస్, టెక్నికల్ సపోర్ట్ అందించే ప్రొవైడర్ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు పెద్ద సాంకేతిక పరిజ్ఞానం లేక కనెక్షన్ని సెటప్ చేయడంలో సహాయం అవసరమైతే ఇది చాలా ముఖ్యమైనది.

మొత్తం మీద చూసుకుంటే మన అవసరాలకు తగిన వాటిని ప్యాకేజీలను ఎంచుకునేందుకు స్థానికంగా ఉండే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందుబాటులో ఉన్న విభిన్న ప్యాకేజీలను పరిశోధించడం చాలా ముఖ్యం. తమ అవసరాలకు సరిపోయే ఉత్తమమైన బ్రాడ్బ్యాండ్ ప్యాకేజ్ ఎంచుకున్నారని నిర్దారించుకునేందుకు ఈ కింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి.

ఇంటర్నెట్ స్పీడ్స్ ఎలా తనిఖీ చేయాలి?

వినియోగదారులు బ్రాడ్బ్యాండ్ ప్యాకేజీని ఎంచుకున్న తర్వాత వారు చెల్లించిన వాటిని పొందుతున్నారా? అని నిర్దారించుకునేందుకు ఇంటర్నెట్ వేగాన్ని పరీక్షించాలి.

ఇంటర్నెట్ స్పీడ్ను స్పీడ్ టెస్ట్ టూల్ని ఉపయోగించి చెక్ చేయొచ్చు. ఇది ఉచిత ఆన్లైన్ సాధనం. లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అందించిన ప్రత్యేక యాప్ కావొచ్చు. స్పీడ్ టెస్ట్ అనేది డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్తో పాటుగా జాప్యం (లేటన్సీ) అలాగే పింగ్ రేట్లను కూడా కొలుస్తుంది.

స్పీడ్ టెస్టులను క్రమం తప్పకుండా చేయడం ద్వారా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ నుంచి వారు ఆశించిన పనితీరును పొందుతున్నారా? లేదా అని తెలుసుకోవచ్చు. కనెక్షన్లో ఏవైనా సమస్యలు ఉంటే త్వరగా గుర్తించేందుకు, సహాయం కొరకు ప్రొవైడర్ని సంప్రదించేందుకు ఉపయోగపడుతుంది.

ఇంటర్నెట్ వేగాన్ని తనిఖీ చేసేందుకు కొన్ని ప్రసిద్ధ సాధనాలు ఉన్నాయి. ఊక్లా, Fast.com, క్లౌడ్ఫ్లేర్ వంటివి ఉన్నాయి. పైన పేర్కొన్న అన్ని సాధనాలు ఉచితంగా లభిస్తాయి. మరియు వీటిని వాడడం కూడా సులభం.

Ookla ద్వారా స్పీడ్ టెస్ట్

Speedtest by Ookla ఊక్లా అందించే స్పీడ్ టెస్ట్ అనేది ఇంటర్నెట్ వేగాన్ని కొలిచే అత్యంత ప్రజాదరణ పొందిన రకాల్లో ఒకటి. ఇది వైర్డ్, వైర్లెస్ కనెక్షన్ల కోసం ఉచిత ఇంటర్నెట్ స్పీడ్ టెస్టును అందిస్తుంది. ఈ స్పీడ్ టెస్ట్ను చేసేందుకు వినియోగదారులు వెబ్సైట్ను సందర్శించాలి. లేదా వారి మొబైల్ యాప్లో టెస్టు చేయాలి. యాప్ ఇంటర్ఫేస్ లోడ్ అయిన తర్వాత స్పీడ్ టెస్ట్ చేసేందుకు ‘గో’ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలు కొన్ని సెకన్లలో ప్రదర్శించబడతాయి. ఇందులో పింగ్, డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్ ఉంటాయి.

Fast.com

Fast.com అనేది నెట్ఫ్లిక్స్ ద్వారా అందజేయబడుతున్న ఉచిత ఇంటర్నెట్ స్పీడ్ టెస్టింగ్ టూల్. ఇది ఖచ్చితమైన ఫలితాలను అందించేందుకు దాని సొంత సర్వర్లను ఉపయోగిస్తుంది. దీనిని సులభంగా ఉపయోగించొచ్చు. వాడేందుకు ఎటువంటి సైన్ అప్ కానీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కానీ ఉండదు. ఇక్కడ యూజర్స్ చేయాల్సిందల్లా వెబ్సైట్ను సందర్శించడం మాత్రమే. స్పీడ్ టెస్ట్ దానంతట అదే ప్రారంభం అవుతుంది. పరీక్ష పూర్తయిన తర్వాత వినియోగదారులకు డౌన్లోడ్ వేగం ఎంత ఉందో చూపబడుతుంది. అదనపు సమాచారం కొరకు 'మోర్ ఇన్ఫో' బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు జాప్యం మరియు అప్లోడ్ స్పీడ్ వంటివి కనబడతాయి.

క్లౌడ్ ఫ్లేర్

Cloudflare క్లౌడ్ఫ్లేర్ అనేది మరొక ఉచిత ఇంటర్నెట్ స్పీడ్ టెస్టింగ్ టూల్. ఇది మీకు కనెక్షన్కు సంబంధించిన పూర్తి వివరాలైన పింగ్, డౌన్లోడ్ స్పీడ్, అప్లోడ్ స్పీడ్, జిట్టర్, ప్యాకెట్ లాస్ వంటి వాటిని అందిస్తుంది. యూజర్స్ మరింత కాంప్రహెన్సివ్ స్పీడ్ టెస్టింగ్ టూల్ కోసం చూస్తున్నట్లయితే వారికి క్లౌడ్ఫ్లేర్ ఉత్తమమైనది.

చివరగా..

బ్రాడ్బ్యాండ్ అంటే ఏమిటనే ప్రశ్నకు సమాధానం మీకు ఈ బ్లాగ్లో లభించిందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అనివార్యం అయిపోయింది. సరైన బ్రాడ్బ్యాండ్ ప్యాకేజ్ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్ మరియు దాని పనితనం మీద ప్రభావం చూపుతుంది. వినియోగదారులు తమ వద్ద ఉన్న ఎంపికల గురించి లోతుగా పరిశోధన చేయడం చాలా ముఖ్యం. బ్రాడ్బ్యాండ్ గురించి నిర్ణయం తీసుకునే ముందు దాని ధర, కనెక్షన్ రకం, డేటా పరిమితులు, కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుందనే విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి.

అంతే కాకుండా తమ ఇంటర్నెట్ కనెక్షన్ వేగాన్ని కొలిచేందుకు వినియోగదారులు స్పీడ్ టెస్ట్ పరికరాన్ని కూడా ఉపయోగించాలి. వేర్వేరు వినియోగదారులు వేర్వేరు అవసరాలను కలిగి ఉంటారని గుర్తుంచుకోవడం ముఖ్యం. బ్రాడ్బ్యాండ్ ప్యాకేజ్ విషయానికి వస్తే అందరి అవసరాలను తీర్చే ఒకే రకమైన కనెక్షన్ ఇక్కడ లభించదు. వారి అవసరాలకు తగిన విధంగా కనెక్షన్ రకాన్ని ఎంచుకోవాలి. తమ అవసరాలకు ఏది సరిగ్గా సరిపోతుందో దానిని ఎంచుకోవాలని వినియోగదారులకు మేము సూచిస్తున్నాం.

Related blogs

13

4 minutes read

How to find Wifi Password of the connected device?

Read more

23

4 minutes read

Benefits of Wi-Fi 6 for Business

Read more

6

4 minutes read

How To Choose the Best Broadband Connection in Hyderabad?

Read more
How may i help you?