తరచూ ఎదురయ్యే వై-ఫై సమస్యలు, వాటిని పరిష్కరించడం ఎలా
-
0
-
-
3 minutes
రౌటర్
వైఫై వాడకంలో వచ్చే సాధారణ సమస్యలు, వాటికి పరిష్కారాలు
ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వైఫై వాడుతూ పని చేసుకుంటున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో వైఫై పని చేయక, చిన్న చిన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించలేక ఇబ్బంది పడుతున్నారు. తక్కువ క్వాలిటీ వీడియో కాల్స్, డౌన్ లోడ్స్ కు ఎక్కువ సమయం పడుతుండటం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో మంచి వైర్ లెస్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలంటే, వైఫై వాడకంలో వచ్చే సాధారణ సమస్యలు, వాటికి పరిష్కారాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.
అవేంటో ఓసారి చూద్దాం -
వైఫై కనెక్షన్ ఫెయిల్యూర్
రౌటర్ ఆన్ చేసి మీ సిస్టమ్ లేదా ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ తో లాగిన్ అయ్యాక SSID, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తారు. నెట్ వర్క్ కు కనెక్ట్ కావడానికి సెట్టింగ్స్ ఆటోమేటిక్ గా మారిపోతాయి. అయినా కనెక్షన్ క్రియేట్ చేయడంతో ఫెయిల్ అవుతారు.
కారణం: వై-ఫై రేంజ్ సమస్యలు లేదా జోక్యం (ఇంటర్ ఫియరెన్స్) కనెక్టివిటీలో ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఇది కొన్ని చిన్న సాంకేతిక అవాంతరాల కారణంగా ఉంటుంది.
పరిష్కారం: మీ వైఫై కనెక్షన్ ఫెయిల్ అయితే మీరు వాడుతున్న డివైస్ లో “forget network” ఆప్షన్ ఎంచుకోండి. వైఫై కి మళ్లీ కనెక్ట్ అవండి. క్రెడెన్షియల్స్ మరోసారి ఎంటర్ చేసి రీ కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి.
ఉన్నట్టుండి ఇంటర్నెట్ పనిచేయకపోవడం
మీ వైఫై సిగ్నల్ బాగానే ఉంటుంది. కానీ కనెక్ట్ అవడానికి ప్రయత్నం చేసినప్పుడు.. ఒక్కోసారి ఇంటర్నెట్ కనెక్షన్ పని చేయడం ఆగిపోతుంటుంది.
కారణం: రౌటర్స్ లో ఉండే సమస్యలే ఇంటర్నెట్ సర్వీస్ ఆగిపోవడానికి కారణం అవుతుంటాయి. రౌటర్ లో వచ్చే ఎల్ఈడీ సిగ్నల్ ఆగిపోవడమో లేదా రెడ్ కలర్ లో కనిపించడం వంటి సిగ్నల్ ద్వారానో ఈ సమస్యను గుర్తించవచ్చు. ఆ సిగ్నల్ అన్నది మీరు వాడే డివైస్ ఆధారంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీ రౌటర్ డైనమిక్ ఐపీ అడ్రస్ తో అసైన్ అయి ఉంటుంది. అప్పుడు నెట్ వర్క్ ఓవర్ లోడ్ అయినా రౌటర్ సామర్థ్యం తగ్గిపోయినా ఐపీ అడ్రస్ ను రౌటర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అదే ఇంటర్నెట్ రాకపోవడానికి కారణం అవుతుంది.
పరిష్కారం: రౌటర్ ను రీ స్టార్ట్ చేయండి. అది ఐపీ అడ్రస్ ను తీసుకునే వరకూ వేచి ఉండండి. నెట్ వర్క్ సమస్య వల్ల ఇలా ఇంటర్నెట్ ఆగిపోతే ఈ చిన్న చిట్కాతో పరిష్కరించుకోవచ్చు.
వైఫై డ్రాపవుట్ ఇష్యూ
ఆన్ లైన్ లో కాంపిటీటివ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఇంటర్నెట్ ఆగిపోతే చాలామంది చిరాకు పడుతుంటారు. అలాంటి సందర్భాల్లో మీ నెట్ వర్క్ లేటెన్సీ అధికంగా ఉందేమో చెక్ చేయండి. చాలా వరకు స్పీడ్ టెస్ట్ యాప్స్ తమ లేటెన్సీని మిల్లీ సెకండ్స్ లోనే చూపిస్తుంటాయి. మీ నెట్ వర్క్ కనెక్షన్ లో ఆ లేటెన్సీ అన్నది 30 మిల్లీ సెకన్స్ కంటే ఎక్కువగా ఉంటే వైఫై సిగ్నల్ లో అప్పుడప్పుడు డ్రాప్స్ కనిపించవచ్చు.
కారణం: సర్వర్ బిజీ అని చాలామంది అంటుంటారు. అలాగే నెట్ వర్క్ ను చాలా మంది వాడుతున్నప్పుడు లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సందర్భాల్లోనే ఇలాంటి లేటెన్సీ సమస్యలు వస్తుంటాయి.
పరిష్కారం: మీ స్మార్ట్ ఫోన్ లో వైఫై అనలైజర్ యాప్ ను డౌన్ లోడ్ చేయండి. ఐడియల్ గా ఉన్న కనెక్షన్స్ ను గుర్తించండి. చాలా వరకు రౌటర్లు కనెక్షన్ ను ఆటోమేటిక్ గా తీసుకుంటాయి. కానీ వైర్ లెస్ నెట్ వర్క్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో మీరు ఉంటే, మీ రౌటర్ ఆటోమేటిక్ గా నెట్ వర్క్ ను తీసుకునే సౌలభ్యాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఛానల్ విడ్త్, ఛానల్ నంబర్ తీసుకున్న తర్వాత మళ్లీ స్పీడ్ టెస్ట్ చేయండి. మెరుగుదలను పరిశీలించండి.
కొన్ని పరికరాల్లో పనితీరు సమస్యలు
కొన్ని కంప్యూటర్లు ఎలాంటి సమస్య లేకుండానే నెట్ వర్క్ కు కనెక్ట్ అవుతుంటాయి. కానీ మరికొన్ని పరికరాలలో ఇంటర్నెట్ స్ట్రీమింగ్ చాలా కష్టంగా ఉంటుంది. నెట్ వర్క్ కంజెషన్ దీనికి కారణం కాదని అర్ధమైతే, మరింత స్పష్టత కోసం వైఫై మోడ్ సెటింగ్స్ ను చెక్ చేయండి.
కారణం: రౌటర్స్ సాధారణంగా 802.11 మోడ్ సెటింగ్స్ తో ఉంటాయి. అలాంటి వాటిని మీరు మార్చిన సందర్భాల్లో సమస్యలు ఏర్పడతాయి. కొన్ని పరికరాలలో పనితీరు సమస్యలు వస్తాయి.
పరిష్కారం: mixed-mode సెట్టింగ్ ని ఎంచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. mixed-mode సెటింగ్స్ ద్వారా వివిధ తరాలకు చెందిన వైఫై అడాప్టర్స్ ఇంటర్ నెట్ సేవలను సరిగ్గా అందిస్తాయి.
వైఫై ట్రబుల్ షూటింగ్ లో ఇలాంటి సులభమైన స్టెప్స్ పాటించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ను ఎంజాయ్ చేయండి. కాస్త ఖాళీగా ఉన్న సమయంలో ఇష్టమైన సినిమాలు చూడండి. ఉత్సాహంగా గేమ్స్ ఆడండి. మీ వైఫై కనెక్షన్ సరిగా ఉన్నప్పుడే ఇంతటి సంతృప్తి, వినోదాన్ని మీరు పొందగలరు. బ్రాడ్ బ్యాండ్ సేవలను సమర్థంగా అందుకోగలరు.