మీ వైఫై ఎలా పనిచేస్తుందో ఆశ్చర్యపోతున్నారా.
-
0
-
-
3 minutes
వై–ఫై (Wi-Fi) అంటే వైర్లెస్ LAN. కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఇదో ఉపయోగకరమైన టెక్నాలజీ. డేటా బదిలీ, కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది పూర్తిగా మార్చేసింది. వై–ఫై (Wi-Fi) అనే పదానికి ఎటువంటి అర్థం రాదు కానీ.. లోకల్ ఏరియా వైర్లెస్ టెక్నాలజీ అనే అర్థం వస్తుంది.
అసలు వైఫై అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
ఇతర వైర్లెస్ పరికరాలు పని చేసినట్లే వైఫై కూడా పని చేస్తుంది. రెండు పరికరాల మధ్య సిగ్నల్స్‌ను పంపించేందుకు ఇది రేడియో తరంగాలను వాడుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం రేడియో తరంగాలు కార్ రేడియోలు, వాకీ-టాకీలు, సెల్ఫోన్లు, వెదర్ రేడియోలు ఉపయోగించే రేడియో తరంగాలకు భిన్నంగా ఉంటాయి. ఇవి వైర్లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ను, నెట్వర్క్ కనెక్షన్లను అందిస్తాయి. వై–ఫై (Wi-Fi) అనేది ఒక ట్రేడ్‌మార్క్ పదం. IEEE 802.11x అని దీనికి అర్థం వస్తుంది.
వై–ఫై (Wi-Fi) ఎలా పని చేస్తుందనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ముందుగా కంప్యూటర్ వైర్లెస్ అడాప్టర్ డేటాను రేడియో సిగ్నల్స్‌గా మారుస్తుంది. యాంటెన్నాను ఉపయోగించి సిగ్నల్స్‌ను ఇది సులభంగా బదిలీ చేస్తుంది. వైర్లెస్ రౌటర్ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకుని వాటిని డీకోడ్ చేస్తుంది. వైర్డ్ ఈథర్నెట్ కనెక్షన్ ద్వారా రౌటర్ ఇంటర్నెట్కు సమాచారాన్ని పంపుతుంది.
వైఫై, ఇంటర్నెట్ మధ్య వ్యత్యాసం ఏమిటి?
వై–ఫై (Wi-Fi) అనే పదం ద్వారా వైర్లెస్ నెట్‌వర్క్‌లను సూచిస్తారు. పాతరోజుల్లో ఏదైనా పరికరాన్ని నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసేందుకు లోకల్ ఏరియా నెట్‌వర్క్‌ను సృష్టించడం ఒక్కటే మార్గంగా ఉండేది. ఇది అసౌకర్యంగా ఉండేది. కానీ వై–ఫై (Wi-Fi) వచ్చిన తర్వాత దీని ద్వారా ఒక పరికరాన్ని వేరే పరికరాలతో కనెక్ట్ చేయడం చాలా సులభమయింది. ఎటువంటి భౌతిక కనెక్షన్ అవసరం లేకుండానే మనం నెట్‌వర్క్‌ను పొందగలుగుతున్నాం. రౌటర్ అనేది ప్రధానంగా ఈ కనెక్షన్లను నియంత్రిస్తుంది. ఒక పరికరం వేరే పరికరంతో రౌటర్ ద్వారానే కమ్యూనికేట్ (కనెక్ట్) చేయబడుతుంది.
ఇంటర్నెట్ను వైడ్ ఏరియా నెట్వర్క్ లేదా WAN అని కూడా పిలుస్తారు. అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను అనుసంధానించే విస్తృత నెట్వర్క్. మీ సొంత వైర్లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయిన తర్వాత మీరు అతిపెద్ద గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగం అవుతారు. దీనినే ఇంటర్నెట్ అని పిలుస్తారు.
వైఫై కోసం మోడెమ్ కావాలా?
వై–ఫై (Wi-Fi) రౌటర్ మోడెమ్ లేకుండా కూడా పని చేస్తుంది. ఐపీ (IP) అడ్రస్‌లతో వై–ఫై (Wi-Fi) కనెక్షన్ అందించేందుకు రౌటర్ ఉంటుంది. దీని వలన మీరు చాలా సులభంగా ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు ఫైల్స్‌ను పంపుకోవచ్చు. మీ ఫోన్లో ఉన్న వీడియోను టీవీకి లేదా Chromecast కు పంపవచ్చు, ఇంకా ఫైల్స్‌ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
వైఫై రౌటర్, మోడెమ్ మధ్య వ్యత్యాసం ఏమిటి?
ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లను అనుసంధానం చేయడానికి, వాటి మధ్య నెట్వర్క్ ట్రాఫిక్‌ను రూట్ చేసేందుకు రౌటర్ ఉంటుంది. రౌటర్‌కు ఇంటర్నెట్తో ఒక కనెక్షన్ ఉండాలి, ప్రైవేట్ లోకల్ నెట్‌వర్క్‌తో ఒక కనెక్షన్ ఉండాలి. చాలా రౌటర్లు బిల్ట్–ఇన్ స్విచ్‌లతో వస్తాయి. దీని వలన అనేక వైర్డ్ పరికరాలను కనెక్ట్ చేయడంలో సాయపడుతుంది. చాలా రౌటర్లు వైర్లెస్ రేడియోలతో వస్తాయి. దీని ద్వారా సులభంగా వై–ఫై (Wi-Fi) పరికరాలను కనెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది.
మోడెమ్ అనేది లోకల్ నెట్వర్క్, ఇంటర్నెట్ మధ్య ఒక వంతెనలాగ పని చేస్తుంది. డిజిటల్ సమాచారాన్ని ఎన్కోడ్ చేయడానికి, టెలిఫోన్ లైన్లలో సిగ్నల్స్‌ను మాడ్యులేట్ చేయడానికి పాత రోజుల్లో మోడెమ్‌లను ఉపయోగించేవారు. ఇంకొక చివరలో డీమాడ్యులేట్ లేదా డీకోడ్ చేయబడ్డాయి. కానీ ప్రస్తుతం వచ్చే ఆధునిక మోడెమ్స్ ఇలా పనిచేయడం లేదు. కనెక్షన్ రకాన్ని బట్టి మోడెమ్ మీ నెట్‌వర్క్‌కు అటాచ్ చేయబడుతుంది. ఆధునిక మోడెమ్‌లు స్టాండర్డ్ ఈథర్నెట్ కేబుల్ ఔట్‌పుట్‌ను అందిస్తాయి. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌తో సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి.. సరైన ISP ఇన్ఫ్రాస్టక్చర్ గల మోడెమ్‌లు అవసరం.
నాకు వైఫై ఎందుకు అవసరం? [నెట్‌ఫ్లిక్స్ చూసేందుకు నాకు వైఫై కావాలా?]
మీ ఇంట్లో వై–ఫై (Wi-Fi) ని ఏర్పాటు చేయడానికి మీకు వైర్లెస్ రౌటర్‌కు కనెక్ట్ చేసిన మోడెమ్ కానీ వైర్లెస్ గేట్‌వే కానీ అవసరం. ఇంటర్నెట్ సర్వీస్ అనేది లేకుండా కూడా వై–ఫై (Wi-Fi) వస్తుంది. ఇతర పరికరాలతో కనెక్ట్ కావడానికి వై–ఫై (Wi-Fi) సిగ్నల్స్‌ను అందించే పరికరాలు ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే నడుస్తాయి.
నెట్‌ఫ్లిక్స్ కోసం వై–ఫై (Wi-Fi) తప్పనిసరి కాదు. అందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా కావాలి. ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సాయంతో కూడా మీరు నెట్‌ఫ్లిక్స్, వీడియోలను చూసేందుకు ఆస్కారం ఉంటుంది.
రోజురోజుకూ వై–ఫై (Wi-Fi) కి ప్రజాదరణ పెరుగుతోంది. ఇది చాలా సరసమైనది, అనుకూలమైది. అంతేగాక, దీనిని పొందండం కూడా చాలా తేలిక. దీని ద్వారా రెగ్యులర్‌గా పనిచేసే పని స్థలం బయట కూడా.. ఇంటర్నెట్ పొందేందుకు వీలుంటుంది. మీ వద్ద వై–ఫై (Wi-Fi) ఉంటే నేవిగేషన్ మీ ప్రొడక్టివిటీని ప్రభావితం చేయదు.
మీ వై–ఫై (Wi-Fi) స్పీడును పెంచుకునేందుకు టిప్స్, ట్రిక్స్‌ను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.