Footer Bottom Menu

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్​ను ఎన్నుకోవడంలో సూచనలు

  • 0

  • 5 minutes

టాప్ ప్రొవైడర్ల జాబితా మరియు అవి అందించే ప్లాన్లను సిద్ధం చేసుకోండి

మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను వాడుతున్నారో తెలుసుకునేందుకు మీ ఇంటి పక్క వారితో మాట్లాడండి. మీ ప్రాంతంలో ఏ ఇంటర్నెట్ సర్వీస్ అయితే ఎక్కువగా వాడతారో అది మంచి కస్టమర్ సర్వీస్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. మీ ఏరియాలో ఉన్న 4-5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల పేర్లను జాబితా చేయండి. అలాగే వారి ప్లాన్లు మరియు మీ ఇంటర్నెట్ వాడకాన్ని బట్టి టారిఫ్ ఎంచుకోండి.

ప్లాన్లను పోల్చి చూడండి

మీ ఏరియాలో ఉండే 4-5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల జాబితా తయారు చేసిన తర్వాత అవి అందించే ఉత్తమ ఆఫర్లను పోల్చి చూడండి. చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) వాటి ఫుల్ టైమ్ ప్లాన్ల మీద ఆఫర్లను కలిగి ఉంటున్నాయి. ఉదాహరణ చూసుకుంటే చాలా వరకు ఆరు నెలల ప్లాన్లలో ACT ఫైబర్నెట్ ఉచిత రూటర్ / ఒక నెల ఉచిత ఇంటర్నెట్ మరియు ఉచిత ఇన్స్టాలేషన్ను అందిస్తోంది. ఈ ఆఫర్ల వలన మీరు దీర్ఘకాలంలో చాలా ఆదా చేస్తారు.

స్పీడ్ టెస్ట్ కోసం పరీక్ష చేయండి

మీకు అనువుగా ఉండే ఇంటర్నెట్ ఫ్లాన్ను కొనుగోలు చేసిన తర్వాత.. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అందించే వేగం కోసం ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ పరీక్ష చేయండి. ఊక్లా(ookla) స్పీడ్ టెస్ట్ ద్వారా మీరు ఇంటర్నెట్ వేగాన్ని తనిఖీ చేయొచ్చు. స్పీడ్ టెస్ట్ ఫలితాల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకునేటపుడు అడగాల్సిన ప్రశ్నలు

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు ఏ ప్రశ్నలు అడగాలో తెలియనపుడు మరింత క్లిష్టంగా ఉంటుంది. మీరు ఫారం మీద సంతకం చేసే ముందే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించిన అన్ని వాస్తవాలను తెలుసుకోవడం కూడా.. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ను మరింత ఎక్కువ ప్రేమించేందుకు కారణం అవుతుంది. మీరు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని ఎంచుకునే ముందు మీకు మీరే ప్రశ్నించుకోవాల్సిన కొన్ని ప్రశ్నల జాబితాను ఇక్కడ ఉంచాం. తద్వారా మీరు తెలివైన వ్యక్తిగా (మంచి ఇంటర్నెట్ ప్రొవైడర్ని ఎంచుకునేందుకు) మారుతారు.

నాకు వైరుతో ఉన్న బ్రాడ్ బ్యాండ్ అవసరమా? లేక వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ అవసరమా?

మీ నెట్వర్క్ను అప్డేట్ చేసేందుకు అయ్యే ఖర్చు సమస్యగా ఉంటే మరియు మీకు అత్యున్నత స్థాయి భద్రత, పనితీరు అవసరమైతే వైర్డ్ నెట్వర్క్ ఉత్తమ ఎంపిక కావొచ్చు. మొబిలిటీ (అటాచ్మెంట్ పాయింట్ను మార్చే ప్రక్రియ) అనేది సమస్యగా లేకపోతే మీ కార్యాలయ అవసరాలకు వైర్డ్ కనెక్షన్ సరిపోతుంది. మీరు ఖర్చు మరియు డిజైర్ మొబిలిటీ మరియు కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ (అత్యాధునిక సాంకేతికత) పట్టించుకోనట్లయితే వైర్లెస్ నెట్వర్క్ను తీవ్రంగా పరిగణించాలి. చాలా మంది కస్టమర్లు వారికి కావాల్సిన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి.. వైర్డ్ మరియు మొబైల్ బ్రాడ్బ్యాండ్ మధ్య ఎంచుకుంటారు. కానీ మీరు వైర్డ్ నెట్వర్క్ను ఎంచుకుంటే కేబుల్ మరియు ఫైబర్ మధ్య కూడా ఎంచుకోవాలి.

వైర్తో ఉన్నది తీసుకుంటే ఫైబర్ తీసుకోవాలా? లేక కాపర్ వైరా?

ఇండియాలో చూసుకున్నట్లయితే కాపర్ (రాగి) ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఇది తరచుగా.. అదే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) నుంచి స్థిరమైన టెలిఫోన్ ల్యాండ్ లైన్ కనెక్షన్తో కలపబడుతుంది. ఈ రంగంలో వివిధ రకాల అభివృద్ధి జరిగింది. ADSL, VDSL, మరియు VDSL2+ వంటివి వచ్చాయి. కాపర్ అప్లోడ్ స్పీడ్ రేంజ్ 5 నుంచి 10 Mbps వరకు మారింది. డౌన్లోడ్ వేగం 15 నుంచి 70 Mbps వరకు ఉంటుంది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ లభ్యత అనేది ఒక సమస్య. ఒక ప్రాంతానికి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ను తీసుకురావాలంటే.. ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లను నిర్మించాలి. మన దేశంలో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వ్యాప్తి ఇప్పటికీ తక్కువగానే ఉండేందుకు ఇది కూడా ఒక కారణం. మరో పక్క చూసుకుంటే డైరెక్ట్ సబ్స్క్రైబర్ లైన్ (DSL) టెలిఫోన్ లైన్లను ఉపయోగిస్తుంది కావున ఎక్కడ చూసినా మనకు రాగి ఇంటర్నెట్ కనెక్షన్స్ కనిపిస్తాయి.

అసలు కనెక్షన్ రేషియో అంటే ఏమిటి?

కనెక్షన్ రేషియో అనేది క్లిష్టమైన నిష్పత్తి. ఒకే సమయంలో సింగిల్ లైన్లో స్థిర బ్యాండ్ విడ్త్ను షేర్ చేసుకునే ఇంటర్నెట్ వినియోగదారులను నిర్ణయిస్తుంది. మీరు ఒక వేళ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఎంచుకున్నా కానీ చాలా మంది వ్యక్తులు ఆ కనెక్షన్ను ఉపయోగిస్తుంటే కనెక్షన్ రేషియో(నిష్పత్తి) ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. కనెక్షన్ రేషియో అనేది 1:8గా ఉంటే ఉదాహరణకు ఆ బ్యాండ్ విడ్త్ను ఒకే సమయంలో 8 ఇళ్ల వారు షేర్ చేసుకోవచ్చు. ఇండియాలో చాలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) 1:30 కనెక్షన్ రేషియోను అందిస్తున్నాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన ఫైబర్ టూ హోమ్ (FTTH) ఇంటర్నెట్తో మీరు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా 1:1 బ్యాండ్ విడ్త్ను కలిగి ఉండొచ్చు. మీరు చెల్లించిన దానికి ఎటువంటి జాప్యం మరియు షేరింగ్ లేకుండా వేగాన్ని పొందారని నిర్ధారిస్తుంది.

ఏవైనా డేటా పరిమితులు ఉన్నాయా?

డేటా పరిమితులు అనేవి మీ ఇంటర్నెట్ వాడకంపై మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా విధించబడిన పరిమితులు. అందరు సర్వీస్ ప్రొవైడర్లు డాటా క్యాప్ (పరిమితి) ను విధించరు. కానీ కొన్ని సర్వీస్ ప్రొవైడర్లు మాత్రం కఠినమైన(హార్డ్ డేటా లిమిట్స్) ఆంక్షలు విధిస్తాయి. హార్డ్ డేటా లిమిట్స్ అంటే.. మీరు ముందుగా నిర్ణయించిన డేటా మొత్తం వాడేస్తే మీ నుంచి అధిక రుసుము వసూలు చేయబడుతుంది. లేదా మీ కనెక్షన్ పూర్తిగా కట్ చేయబడుతుంది.

వేగానికి హామీ ఇవ్వడం సాధ్యమేనా?

బాధాకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇంటర్నెట్ ప్రొవైడర్లు వేగానికి హామీ ఇవ్వరు. కానీ దాని గురించి అడగడం ఎప్పుడూ తప్పు కాదు. మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీ ప్లాన్ ప్రకారం పని చేయకపోతే, మీరు ఏం చేయగలరో ఇక్కడ తెలుసుకోండి. పరికరాల వైఫల్యం లేదా ఎక్కువ మంది ఒకే కనెక్షన్ను వాడడం వలన స్లో ఇంటర్నెట్ స్పీడ్ సంభవించే అవకాశం ఉంది.

నా ACT ఫైబర్నెట్ కనెక్షన్ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

మీ ACT ఫైబర్నెట్ కనెక్షన్ను యాక్టివేట్ చేసుకునేందుకు మీరు ఈ కింది సాధారణ దశలను అనుసరించాలి.

https://www.actcorp.in/new-broadband-connection-op అనే లింక్కు వెళ్లాలి లేదా ACT ఫైబర్నెట్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి.

మీకు కావాల్సిన కనెక్షన్ను ఎంచుకోవాలి. హోం బ్రాడ్ బ్యాండా లేక ఆఫీస్ బ్రాడ్ బ్యాండా అని.

మీ పేరు, మెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ వంటి మీ వ్యక్తిగత వివరాలతో కూడిన ఫామ్ పూర్తి చేయాలి.

మీకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవాలి.

మీరు ఎంత కాలానికి తీసుకోవాలనుకుంటున్నారు. మరియు ఏ ఆఫర్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో ఎంచుకోండి.

డబ్బులు చెల్లించి మీ అభ్యర్థనను సమర్పించండి. మీరు మీ పత్రాలను పూర్తి డిజిటల్ ట్రాన్సాక్షన్ పద్ధతిలో అప్లోడ్ చేయొచ్చు.

నేను కొత్త బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఎలా ఫిట్ చేయించుకోవాలి? (అమర్చుకోవాలి)

మీ ACT వైఫై రూటర్ని ఈ కింది విధంగా కనెక్ట్ చేయండి.

మీ ఫోన్లోని సెట్టింగ్స్కు వెళ్లి వైఫై ఆన్ చేసి రూటర్ పేరు గుర్తించే వరకు వేచి ఉండండి. కనెక్ట్ చేసేందుకు రూటర్ పేరు మీద ప్రెస్ చేయండి. వైఫై ఆన్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి వైర్లెస్ అండ్ నెట్వర్క్లకు వెళ్లి వైఫై మీద నొక్కండి. మీ ఫోన్ రూటర్ పేరు గుర్తించే వరకు వేచి ఉండండి. పేరును గుర్తిస్తే రూటర్ పేరు మీద నొక్కండి. వైఫై పాస్వర్డ్ను ఎంటర్ చేసి కనెక్ట్ చేసేందుకు నొక్కండి.

ACT ఫైబర్నెట్కు నా డివైస్ (పరికరాలు)లను ఎలా కనెక్ట్ చేసుకోవాలి?

మీ కంప్యూటర్ను ఇంటర్నెట్కు ఎలా కనెక్ట్ చేయాలో దశల వారీగా ఇక్కడ ఇవ్వబడింది.

మీ మోడమ్ను కనెక్ట్ చేయండి రూటర్ని సెటప్ చేయండి

మీ ఇంటర్నెట్ కనెక్షన్ను టెస్ట్ చేయండి మరియు ఏవైనా సమస్యలుంటే పరిష్కరించండి.

మీ మోడమ్ మరియు నెట్వర్క్ భద్రతను సెటప్ చేయండి

మీ కంప్యూటర్ లేదా ఇతర పరికరంలో వైర్లెస్ నెట్వర్క్కు కనెక్ట్ చేయండి.

విశ్వసనీయత అనేది కీలకం.. ఎంత వేగంగా ఉంటే అంత మంచిది.

ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్య ఆంశం విశ్వసనీయత. మీకు అవసరం ఉన్న ప్రతిసారి ఎటువంటి అంతరాయాలు లేని ఇంటర్నెట్ను ఎంచుకోవడం అవసరం. విశ్వసనీయత లేని ఇంటర్నెట్ కారణంగా మీరు కస్టమర్స్ మరియు సేల్స్ను కోల్పోతే, మీరు చాలా బాధపడతారు. మీకు ఎక్కువ కనెక్షన్లు ఉంటే ఎక్కువ బ్యాండ్ విడ్త్ అవసరం. చాలా వరకు బిజినెస్ అప్లికేషన్లయిన ఫైల్ షేరింగ్ (ఫైల్స్ పంపిణీ), ఆన్లైన్ బ్యాకప్స్ వంటి వాటి కోసం ఎక్కువ అప్లోడ్ స్పీడ్ అవసరం. సరిసమానమైన అప్లోడ్ మరియు డౌన్ లోడ్ స్పీడున్న ఫాస్ట్ కనెక్షన్ చాలా కీలకం. వేగవంతమైన కనెక్షన్ కింది వాటిని అనుమతిస్తుంది.

త్వరితగతిన ఫైల్స్ డౌన్లోడ్ చేయడం/అప్లోడ్స్ చేయడం వలన ఉత్పాదకత మెరుగుపడుతుంది.

కస్టమర్లు మరియు సహోద్యోగులతో వేగవంతమైన కమ్యూనికేషన్

ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని ప్రారంభించేందుకు సమర్థవంతమైన వెబ్సైట్ హోస్టింగ్ – ఏదైనా విషయాన్ని బ్రౌజ్ చేస్తున్నపుడు లేదా కొనుగోలు చేస్తున్నపుడు వేగవంతమైన లోడింగ్ కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

క్రిటికల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ రియు యాంటీ వైరస్ వంటి ప్రోగ్రాములకు ఫాస్టర్ అప్డేట్స్.

వ్యాపార సమాచారాలను ఆన్లైన్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. - CRM, ఇంటర్నల్ క్లౌడ్ స్టోరేజ్ మొదలయినవి.

Related blogs

13

4 minutes read

How to find Wifi Password of the connected device?

Read more

23

4 minutes read

Benefits of Wi-Fi 6 for Business

Read more

6

4 minutes read

How To Choose the Best Broadband Connection in Hyderabad?

Read more
How may i help you?