ఇంట్లో వాడేందుకు అన్లిమిటెడ్ వైఫై ప్లాన్లు
-
0
-
-
3 minutes
WI-FI కనెక్షన్
మీ ఇంటి కోసం ACT ఫైబర్నెట్ అందిస్తున్న అన్లిమిటెడ్ WI-FI ప్లాన్స్
ఇంటికి కానీ, ఆఫీసులో కానీ ఎవరైనా సరే నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకున్నపుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది స్పీడ్ గురించే. ACT ఫైబర్నెట్ స్మార్ట్ ఫైబర్ టెక్నాలజీతో తయారు చేయబడింది. హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో నివసించేవారికి ACT ఫైబర్నెట్ అద్భుతమైన నెట్ స్పీడ్ను అందిస్తుంది. ACT ఫైబర్నెట్ వైర్డ్ బ్రాడ్బాండ్ సర్వీసుల్లో చాలా వేగవంతమైనది. బెంగళూరు, జైపూర్, కోయంబత్తూరు వంటి నగరాల్లో కూడా ACT తన సేవలను అందిస్తోంది.
మీరు ఎంత డేటాను ఉపయోగిస్తారు?
సాధారణంగా రోజుకు మీకు ఎంత డేటా అవసరమవుతుందో ఇక్కడ ఇచ్చాం. ఈ గణాంకాలు కేవలం అంచనా మాత్రమే. మీరు రోజువారీగా ఉపయోగించే డేటా అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు. లేదా తక్కువగా ఉండవచ్చు. డేటా వినియోగం అనేది మనం వాడే సైట్లను బట్టి మారుతూ ఉంటుంది.
మీకు అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ ఎందుకు అవసరం?
ప్రతి ఒక్కరూ అన్లిమిటెడ్ డేటా ప్లాన్ను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం అదనపు చార్జీలు. ఒకవేళ మీ డేటా ప్లాన్ పరిమితంగా ఉండి, మీరు దాన్ని పూర్తిగా వాడేసిన తర్వాత ఇంకా వాడాల్సి వస్తే అదనపు చార్జీల బాదుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చార్జీల నుంచి అన్లిమిటెడ్ డేటా ప్లాన్ మిమ్మల్ని కాపాడుతుంది.
డేటా చార్జీలు అనేవి చాలా ముఖ్యం. మీరు ఒక వేళ లిమిటెడ్ డేటా ప్లాన్ను ఎంచుకుంటే ప్లాన్ డేటా అయిపోయిన తర్వాత అదనంగా వాడిన డేటాకు అధికంగా చార్జీలు వసూలు చేస్తారు. ఈ చార్జీలను చూసి మీరు షాక్ అవుతారు.
హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ACT ఫైబర్నెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్..
A-Max 1325 ప్లాన్, 1999 ప్లాన్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు నమ్మశక్యం కాని రీతిలో రూ. 1,325, రూ. 1,999 ఉంటాయి. A-Max 1325 ప్లాన్లో 300 Mbps, 1999 ప్లాన్లో 400 Mbps స్పీడ్ వస్తుంది. ఈ రెండు అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్. అంటే వీటితో మనకు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. ACT ఫైబర్నెట్ ద్వారా స్పీడ్ను పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
A-Max 500 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో నెలవారీగా చార్జీలు వసూలు చేస్తారు. రూ. 500 లకు 500GB డేటా లభిస్తుంది. డేటా స్పీడ్ 40 Mbps ఉంటుంది. డేటా కోటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 512 Kbpsకి తగ్గించబడుతుంది. ఎంతో పాపులర్ అయిన A-Max 700 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కూడా ACTలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్లో డేటా స్పీడ్ 75 Mbpsగా వస్తుంది. FUP (ఫెయిర్ యూసేజ్ పాలసీ) 1TBగా ఉంటుంది. FUP పూర్తయిన తర్వాత స్పీడ్ 1 Mbpsకి తగ్గించచబడుతుంది. అదేవిధంగా A-Max 1075 ప్లాన్లో 150 Mbps స్పీడ్ లభిస్తుంది. FUP లిమిట్ 2TBగా ఉంటుంది. FUP లిమిట్ ముగిసిన తర్వాత స్పీడ్ 3Mbpsకి కుదించబడుతుంది.
చెన్నై నగరంలో ACT ఫైబర్నెట్ అందిస్తున్న అన్లిమిటెడ్ ప్లాన్స్
ACT బేసిక్, ACT బ్లేజ్, ACT బ్లాస్ట్ ప్రోమో, ACT స్టార్మ్, ACT లైటెనింగ్ ప్లాన్స్ నమ్మశక్యం కాని కొత్త స్పీడ్స్కు అప్గ్రేడ్ చేయబడ్డాయి. అంతేకాకుండా ఇవి అన్లిమిటెడ్ FUPతో మనకు అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 60Mbps డేటా స్పీడ్ వచ్చే నెలవారీ ప్లాన్ ఎంచుకుంటే నెలకు రూ. 820 చెల్లించాల్సి వస్తుంది. అదేవిధంగా ACT బ్లేజ్ ప్లాన్కు మనం నెలకు రూ. 1,020 కట్టాలి. ఈ ప్లాన్లో డౌన్లోడ్ స్పీడ్ 125Mbpsగా ఉంటుంది. ACT బ్లాస్ట్ ప్రోమో ప్లాన్ను ఎంచుకుంటే నెలకు రూ. 1,075 కట్టాల్సి ఉంటుంది. ఈ ప్లాన్లో డౌన్లోడ్ స్పీడ్ 200Mbpsగా ఉంటుంది. అంతేకాకుండా మనం ACT స్టార్మ్ ప్లాన్ను గనుక ఎంచుకుంటే నెలకు రూ. 1,125 కట్టాల్సి వస్తుంది. ఈ ప్లాన్ 250Mbps స్పీడ్ను ఆఫర్ చేస్తుంది. ACT లైటెనింగ్ ప్లాన్ ఎంపిక చేసుకుంటే నెలకు రూ. 1,325 ఉంటుంది. ఇది నమ్మశక్యం కాని 350Mbps స్పీడ్ను కలిగి ఉంటుంది.
బెంగళూరులో ACT ఫైబర్నెట్ అన్లిమిటెడ్ ప్లాన్స్..
ACT ఫైబర్నెట్ తన సేవలను బెంగళూరులో కూడా అందిస్తోంది. బెంగళూరులో ACT ఫైబర్నెట్ ప్లాన్ వివరాలను పరిశీలిస్తే.. ఇక్కడ మనకు 10 రకాల ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. నెలకు రూ. 710 చవకైన ప్లాన్తో పాటు నెలకు రూ. 5,999 ల విలువైన ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అన్లిమిటెడ్ ప్లాన్ కావాలనుకుంటే 1425 డాలర్ల చార్జి ఉంటుంది. ఈ ప్లాన్లో మనకు 250 మెగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్ వస్తుంది. ఈ ప్యాకేజిలో నెలకు 3,300GB డేటాను వాడుకునే సౌలభ్యం ఉంటుంది.
ఢిల్లీలో ACT ఫైబర్నెట్ అన్లిమిటెడ్ ప్లాన్ల వివరాలు
ఢిల్లీలో ACT ఫైబర్నెట్ ప్రస్తుతం మూడు బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను ఆఫర్ చేస్తుంది. ప్రతీ ప్లాన్ హై స్పీడ్ ఇంటర్నెట్ను కలిగి ఉంటుంది. ACT ఫైబర్నెట్ ఢిల్లీ బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల వివరాలు పూర్తిగా తెలుసుకుంటే.. ACT సిల్వర్ ప్రోమో, ACT ప్లాటినమ్ ప్రోమో, ACT డైమండ్ ప్రోమో అనే మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ACT సిల్వర్ ప్రోమో ప్లాన్లో 150 Mbps డేటా స్పీడ్ వస్తుంది. దీనికి రూ. 799 చెల్లించాలి. ఢిల్లీలో మనకు లభించే ACT ప్లాన్స్లో ఇదే చవకైనది. ఇక ACT ప్లాటినమ్ ప్రోమో ప్లాన్లో సెకనుకు 250 మెగాబిట్స్ డేటా వస్తుంది. ఈ ప్లాన్కు రూ. 1,049 చెల్లించాలి. ఇక చివరగా ACT డైమండ్ ప్రోమో ప్లాన్లో సెకనుకు 300 మెగాబిట్స్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ రూ. 1,349 లకు లభిస్తుంది.
ACT ఫైబర్నెట్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సెకనుకు 1 గిగాబిట్ స్పీడ్ను సైతం ఆఫర్ చేస్తోంది. మరిన్ని ACT బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు కింద అందుబాటులో ఉన్నాయి.