ఆదర్శవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎన్నుకునేందుకు కంప్లీట్ గైడ్
-
0
-
-
4 minutes
చాలాకాలం క్రితం ఇంటర్నెట్ అనేది కేవలం సంపన్నులకు మాత్రమే లభ్యమయ్యే విలాస వస్తువు అనే భ్రమ ఉండేది జనసామాన్యంలో. ఇప్పటికాలంలో అది ప్రజలందరికీ దైనందిన జీవితంలో అత్యవసరమైన వస్తువు అయిపోయింది. అంతేకాక, ప్రజలందరికీ వారు ఏది కోరుకుంటే ఆ విషయాన్ని క్షణాల్లో అందించి, వారు ఆయా విషయాలను తమ ప్రాంతాన్ని, తమ ఇంటిని కూడా దాటకుండా, కూలంకషంగా తెలుసుకోగలిగేలా, అందరికీ అరచేతిలో స్వర్గంలాగా తయారయ్యింది ఇంటర్నెట్.
అయితే, అలా వారు తెలుసుకోగలగాలంటే కావాల్సినది ముఖ్యంగా కావలసినది మంచి ఇంటర్నెట్ సదుపాయం. అదికూడా మంచి స్పీడున్న, డిస్టర్బెన్సు లేని ఇంటర్నెట్ కావాలి. అయితే ఇక్కడే, “సరైన ఇంటర్నెట్ ను ఎంచుకోవడానికి స్పీడును మాత్రమే పరిగణనలోకి తీసుకోవటం సరిపోతుందా? లేక ఇతర అంశాలు కూడా ఉన్నాయా?” అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది.
ఈ అన్ని ప్రశ్నలకూ సమాధానాలు కావాలంటే ఈ క్రింద ఇచ్చిన వివరాలను చివరిదాకా చదవండి. మంచి ఇంటర్నెట్ అనడానికి కావాల్సిన అంశాల గురించిన పూర్తి అవగాహనతోపాటు అవన్నీ ఎలా ఎంపిక చేసుకోవాలో, మంచి ప్రొవైడర్ ని ఎలా ఎంచుకోవాలో కూడా అర్థమౌతుంది.
Is speed the sole factor in selecting ISP?
మంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవడానికి, కేవలం స్పీడు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలా?
మంచి ఇంటర్నెట్ అనే విషయంలో స్పీడుకు చాలా ప్రాధాన్యత ఉంది అనేది నిర్వివాదాంశం. మంచి ఇంటర్నెట్ స్పీడ్ అనేక బిజినెస్ లు, ఇతర కార్యకలాపాలు ఆలస్యం కాకుండా సజావుగా జరగడానికి అంతులేని సహకారాన్ని అందిస్తుంది.
చాలాసార్లు ఇంటర్నెట్ ప్రొవైడర్లు వినియోగదారుల్ని ఆకర్షించడానికి తాము అందిస్తున్నది చాలా స్పీడున్న ఇంటర్నెట్ అనే విషయాన్ని పదే పదే చెప్తుంటారు. అయితే ఈ స్పీడు వారు చెప్పినంత బాగా అన్ని ప్రదేశాలలోను రాకపోవచ్చు. మనం నివసిస్తున్న ప్రదేశాన్ని బట్టి, మన దగ్గరలో ఆయా ఇంటర్నెట్సుకు ఉన్న సిగ్నల్స్ ను బట్టి ఈ స్పీడు మారుతూ ఉంటుంది. కొందరు వినియోగదారులు ఫైబర్ నెట్వర్కు ద్వారా సుమారు 1000 MBPS వరకు పొందుతూ ఉండగా మారుమూల పల్లె ప్రాంతాల్లోని వినియోగదారులు సుమారు మూడు నుంచి ఆరు MBPS వరకు మాత్రమే DSL కనెక్షన్ల ద్వారా పొందగలుగుతుంటారు.
Key Parameters To Select The Internet Service Provider
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడే అంశాలు
ఇంటర్నెట్ ను ఎంచుకోవడానికి స్పీడు అనేది నిజంగనే ముఖ్యమైన అంశం అయినప్పటికీ, అది మాత్రమే సరిపోదు. చాలా ఇతర అంశాలు కూడా పరిగణించవలసి ఉంటుంది. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాము.
లభ్యత (Availability)
ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. ఎక్కువ స్పీడు, ఎక్కువగా అందుబాటులో ఉండటం. అధిక స్పీడు ఇంటర్నెట్ మంచి కనెక్టివిటీని కలిగి ఉన్నప్పటికీ, అందుబాటులో ఉండటం, సక్రమంగా పని చేయడం అనేవి కూడా పరిశీలించవలసిన అంశాలు.
అధిక స్పీడు ఇంటర్నెట్ ప్రొవైడరును ఎంచుకోవడం కన్నా, మన ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రొవైడరును ఎంచుకోవడం అన్నివిధాలా ఉత్తమం. కొన్ని పల్లె ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో కష్టమర్లకు అందించే ఇంటర్నెట్ సౌకర్యాలు (ISP) చాలా తక్కువగా ఉంటాయి.
కాబట్టి, ఇంటర్నెట్ ప్రొవైడరును ఎంచుకొనేముందు అసలు మన ప్రాంతంలో సరైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని (ISP) అందించే ప్రొవైడరు ఎవరు అనేదాన్ని గూగుల్ ద్వారానో మరోదాని ద్వారానో వెతికి పట్టుకోవాలి. ఇలా ఎక్కువ అందుబాటుతనం ఉన్న ప్రొవైడర్లు సాధారణంగా సంవత్సరానికి అప్ – టైము 99.99% ను అందించేలాగాను, డౌన్ – టైము సుమారు రెండు గంటలు అందించేలాగాను ఒక అగ్రిమెంటును ఇస్తారు.
కాబట్టి మీ బిజినెస్ పూర్తిగా ఇంటర్నెట్ మీద ఆధారపడి పనిచేసేది, ఆఫ్ లైన్ లో పనిచేసేది కాకపోతే కనుక తప్పకుండా అందుబాటుతనం అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
ఇంటర్నెట్ మాత్రమే మీ వ్యాపార వ్యవహారాలను నిర్ణయించే అంశం అయినప్పుడు తప్పకుండా ఎక్కువ అందుబాటులో (High-Availability) ఉన్న ఇంటర్నెట్ ను ఎంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.
కనెక్షన్ విధానం (Type of Connection)
ఇంటర్నెట్ కనెక్షన్ ఎంచుకొనేటప్పుడు కనెక్షన్ విధానాన్ని కూడా పరిగణించాలి. అంటే ఆ కనెక్షన్ వైరులతోనా లేక వైర్ లెస్ కనెక్షనా అనేదాన్ని ఆలోచించాలి. ఈ కనెక్షన్ అంశం కొన్నిసార్లు మీ ఇంటర్నెట్ స్పీడును కూడా నిర్ణయించే అవకాశం ఉంది.
శాటిలైట్ కనెక్షన్ లేక వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేవి చాలా సార్లు తక్కువ స్పీడును అందిస్తాయని చాలామంది చాలా సార్లు అంటూంటారు. దీనికి స్పష్టమైన కారణం అది భౌతికంగా కనెక్టు కాకుండా కేవలం సిగ్నల్స్ మీద ఆధారపడటమే. ఏది ఏమైనప్పటికీ, వైరుతో కనెక్టు చేయబడిన ఇంటర్నెట్ లేదా ఫైబర్ కనెక్షన్లు చాలా వేగవంతంగా పనిచేయటం మనం ఎక్కువగా గమనిస్తుంటాము.
కాబట్టి ఇంటర్నెట్ ను ఎంచుకొనేటప్పుడు ఆ ప్రొవైడరు మన సమీపంలో అంటే అందుబాటులో ఉంటూ మనకు అవసరమైనప్పుడు సేవలు అందించేలా ఉన్నారా లేదా అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
నమ్మకమైన కస్టమర్ సర్వీస్ (Reliable Customer Service)
మనకు కావలసిన నమ్మకమైన ఇంటర్నెట్ ప్రొవైడరును గురించి చర్చించేటప్పుడు మరచిపోకుండా, తప్పక పరిగణించవలసిన మరో అంశం “నమ్మకమైన కస్టమర్ సర్వీసును అందిస్తున్నారా, లేదా”? అనేది. ఇది తమ వ్యాపారాన్ని ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే వ్యాపారస్తులకు మరీ ముఖ్యంగా గమనించవలసిన అంశం. సరైన కస్టమర్ సర్వీసు లేని, నమ్మకస్తుడు కాని ఇంటర్నెట్ ప్రొవైడరును ఎంచుకోవడం వారికి ఒత్తిడిని కలిగించడమే కాకుండా వారి వ్యాపారాన్ని, వ్యవహారాలను దెబ్బ తీస్తుందనేది నిర్వివాదాంశం.
కాబట్టి మీరు ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారులైతే, మీకు దగ్గరలో, అందుబాటులో మీకు సరైన సర్వీస్ లెవెల్ అగ్రిమెంటును అందించగలిగిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకోండి. ఈ కాంట్రాక్టు మీకు వారు ఎంత నమ్మకమైన ఇంటర్నెట్ ను అందిస్తారు అనే విషయాన్ని స్పష్టపరుస్తుంది.
ఒక్కోసారి ఎంత మంచి నెట్వర్కు కనెక్షను కలిగి ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు అది నెమ్మదించడమో, ఇబ్బంది పెట్టడమో అస్సలు జరగదు అని చెప్పలేము. అది ఫిజికల్ డేమేజి కావచ్చు, హార్డువేరుకు సంబంధించిన ఇబ్బంది కావచ్చు. అటువంటప్పుడు మంచి కస్టమర్ సర్వీసు ద్వారా మనం నిశ్చింతగా ఉండడం సాధ్యమౌతుంది.
మంచి నమ్మకస్తుడైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరు మంచి కస్టమర్ సర్వీసును కూడా ఇవ్వగలిగినప్పుడే మనకు కలిగిన ఇబ్బందిని తొందరగా తొలగించి మన రోజువారీ వ్యవహారాలకు ఆటంకం కలగకుండా చేయగలడం అనేది సాధ్యపడుతుంది.
ధర (Cost)
ఇంటర్నెట్ ను ఎంచుకోవడంలో పైన చెప్పిన అందుబాటుతనం, కనెక్టివిటీ, మంచి కస్టమర్ సర్వీస్ (Availability, Connectivity, Good Customer Service) లతో పాటు పరిగణించదగిన మరో అంశం వారు ప్రతిపాదించిన ధర.
వారు సూచించిన బ్రాడ్ బాండ్ ప్లాన్ లను ఎంచుకొనేటప్పుడు మీకు “ఈ సర్వీసును పొందడానికి ఎంత ధర చెల్లించాలి? ఎంత తక్కువ ధరలో ఎంత మంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందగలము? ఒకవేళ మనం చెల్లించే ధర సబబేనా?” అనే ప్రశ్నలు కలుగుతాయి. వీటన్నింటికీ జవాబులు దొరికితేనే మీరు తుది నిర్ణయం తీసుకోగలిగే వీలు కుదురుతుంది.
మంచి ఇంటర్నెట్ సదుపాయం విషయంలో “మంచి స్పీడు – దానికై మనం చెల్లించే ధర” వీటి మధ్య సమతుల్యం ఉండాలి. మీరు వేసుకున్న బడ్జెట్ కు అనుగుణమైన సర్వీసునే ఎంచుకోవాలని స్థిరంగా అనుకోవడం వల్ల మీ బడ్జెట్ లోనే మీకు మంచిది లభించే అవకాశం ఉంటుంది. మీరు ఎంచుకోవడానికి ఎన్నో రకాల ప్యాకేజిలు ఉంటాయి. కాబట్టి అవసరాన్ని, బడ్జెట్ ను మించి ఖర్చు చేయడం అనవసరమైన పని.
చివరిగా, మంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరును ఎంచుకోవడం నిజంగా చాలా ముఖ్యమైన విషయం కనుక, ప్రతివారూ ఇంటర్నెట్ స్పీడును మాత్రమే కాక, ఈ పైన చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మంచి ఇంటర్నెట్ ను ఎంచుకోవాలి. మీరు కాని ఈ మధ్యకాలంలో గూగుల్ లో ”మంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడరు” గురించి వెతికిన వారిలో ఒకరై ఉంటే, వెంటనే ఆలస్యం చెయ్యకుండా, ACT Fibernet ను వెంటనే సంప్రదించండి. మంచి ఇంటర్నెట్ సదుపాయాన్ని మీ సొంతం చేసుకోండి.